Nithin: బన్నీ దర్శకుడితో నితిన్ కొత్త సినిమా.. మొదలయ్యేది ఎప్పుడంటే?

నితిన్ గత ఏడాది వరస సక్సెస్ సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉండగా ఈ ఏడాది కాస్త ఊపుతగ్గింది. ఇప్పటికే ఈ ఏడాది విడుదలైన ‘చెక్, రంగ్ దే’ రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోగా నితిన్ మాత్రం వేగం తగ్గకుండా ఈ ఏడాది..

Nithin: బన్నీ దర్శకుడితో నితిన్ కొత్త సినిమా.. మొదలయ్యేది ఎప్పుడంటే?

Nithin Vamshi

Nithin: నితిన్ గత ఏడాది వరస సక్సెస్ సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉండగా ఈ ఏడాది కాస్త ఊపుతగ్గింది. ఇప్పటికే ఈ ఏడాది విడుదలైన ‘చెక్, రంగ్ దే’ రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోగా నితిన్ మాత్రం వేగం తగ్గకుండా ఈ ఏడాది మూడవ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘మాస్ట్రో’ సినిమా చేస్తున్నాడు. ఇది హిందీ సినిమా ‘అంధాధూన్’కు రీమేక్ కాగా ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు.

గాంధీ తెరకెక్కించే సినిమాతో పాటు నితిన్ మరో సినిమాను కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడని చెప్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ నితిన్ కోసం ఎప్పుడో ఒక కథ రాసుకున్నాడు. స్టోరీలైన్ కు నితిన్ కూడా అప్పుడే ఒకే చెప్పాడని ప్రచారం జరిగింది. అయితే.. తొలిసారి నా పేరు సూర్య ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో వంశీ కొద్దిగా విరామం తీసుకున్నాడు. కాగా ఇప్పుడు కొత్త సినిమా పనులు మొదలు పెట్టాడట.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగష్టులో వక్కంతం వంశీ సినిమా మొదలు పెట్టాలని చూస్తుండగా ఇప్పటికే మిగతా క్యాస్టింగ్ వేట కూడా మొదలైనట్లు చెప్తున్నారు. ఓ బడా నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించనుందని మాత్రమే లీకులు ఇస్తున్న వంశీ టీం కాస్త గోప్యంగా ఈ సినిమా పనులు చక్కబెడుతున్నారు. నితిన్ కూడా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ మొదలుపెట్టే ఆలోచనలోనే ఉండడంతో ఈ ఏడాదే వంశీ సినిమా కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.