No Kissing zone: ప్రేమ జంటలతో విసిగిపోయిన ప్రజలు ‘నో కిస్సింగ్ జోన్’ అంటూ బోర్డ్ పెట్టేశారు

‘మా కాలనీలో ముద్దులు పెట్టుకోవద్దు..ఇది ‘నో కిస్సింగ్ జోన్’ అంటూరాసి పెట్టారు ముంబైలోని హౌసింగ్ సొసైటీ వాసులు. సాయంత్రం ఐదు అయ్యేసరికల్లా హౌసింగ్ సొసైటీ వద్దకు చేరుకున్న ప్రేమజంటలు ముద్దులు పెట్టుకుంటూ కౌగలించుకుంటూ రెచ్చిపోతున్నారు. దీంతో ప్రేమజంట ముద్దుల సీన్లు చూడలేక ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

No Kissing zone: ప్రేమ జంటలతో విసిగిపోయిన ప్రజలు ‘నో కిస్సింగ్ జోన్’ అంటూ బోర్డ్ పెట్టేశారు

No Kissing Zone

No kissing zone : ‘మా కాలనీలో ముద్దులు పెట్టుకోవద్దు.. ఇది ‘నో కిస్సింగ్ జోన్’ అంటూ బోర్డు పెట్టేశారు ముంబైలోని హౌసింగ్ సొసైటీ వాసులు. సాయంత్రం ఐదు అయ్యేసరికల్లా హౌసింగ్ సొసైటీ వద్దకు చేరుకుని ప్రేమజంటలు ముద్దులు పెట్టుకోవడం చేస్తున్నారంటూ.. కౌగలించుకుని సమాజంతో పనిలేకుండా రెచ్చిపోతున్నారంటూ ఈమేరకు బోర్డు పెట్టేశారు కాలనీవాసులు. పోలీసులు కూడా పట్టించుకోకపోవటంతో సదరు సొసైటీవాసులు వాసులు ప్రేమజంట ముద్దుల్ని చూడలేక ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మా కాలనీలో ముద్దులు పెట్టుకోవద్దు..మీ ముద్దులు మురిపాలు ఇక్కడ కుదరవ్’ అంటూ బోర్డు పెట్టారు ముంబైలోని బోరివలి ప్రాంతంలోని సత్యం శివమ్ సుందరం సొసైటీ నివాసితులు.

‘నో కిస్సింగ్ జోన్’ అని రాయటంతో పెట్టడంతో సత్యం శివమ్ సుందరం సొసైటీ వార్తల్లోకెక్కింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొవిడ్ లాక్‌డౌన్ ప్రారంభం నుంచి ప్రతీరోజూ సాయంత్రం 5 గంటల నుంచి జంటలు బైకులు, కార్లలో వచ్చి కాలనీలో ముద్దుల వర్షం కురిపించుకుంటున్నారు. ప్రేమజంటల ముద్దులు చూడలేక ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. కానీ వాళ్లు కూడా పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన సత్యం శివమ్ సుందరం సొసైటీ నివాసితులు తమ కాలనీని ‘నో కిస్సింగ్ జోన్’గా ప్రకటించి రోడ్లమీద రాశారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ..‘‘మేం ముద్దులు పెట్టుకోవటానికి వ్యతిరేకం కాదు. కానీ మా కాలనీని మాత్రం కిస్సింగ్ జోన్ గా మారనిచ్చేది లేదు. కానీ బహిరంగంగా..ఎవరు పడితే వాళ్లు రావటం..కౌగలించుకోవటాలు..ముద్దులు పెట్టుకోవటాలు. ఇవన్నీ చూస్తుంటే చికాకుగా అనిపిస్తోంది. పిల్లలు ఆడవాళ్లు చూస్తే ఏం బాగుటుంది? దీంతో మేం సదరు జంటల వద్దకు మేం సిగ్గు విడిచి వెళ్లి మరీ చెప్పాం. ‘బహిరంగంగా ముద్దులు పెట్టుకోవద్దు’ అని వివరించి చెప్పాం. కాని ఎవ్వరూ వినట్లేదు. వాళ్లు చేసే పని మానట్లేదు. అందుకే మేం ‘నో కిస్సింగ్ జోన్’ గా ప్రకటించాం’’ అని చెప్పుకొచ్చారు.

మొదట్లో మేం మా కాలనీలో జంటలు చేసే పనులు వీడియోలు తీసి స్థానిక కార్పొరేటరుకు చూపించాం. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసాం.కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు.అందుకే మా కాలనీలో ‘నో కిస్సింగ్ జోన్’ అని ప్రకటించటానికి బోర్డులు పెట్టామని కైలాసరావు దేశ్‌ముఖ్ అనే కాలనీ వాసి తెలిపారు.

ఏదో పచ్చదనం కోసమో..కిటికీల నుంచి బయటకు చూస్తే చాలు..వీధుల్లో రోజూ జరిగే రొమాన్స్ చూసి విసిగిపోయాం. బాల్కనీలోకి వచ్చే పరిస్థితి కూడా లేదు.ఎక్కడ చూసినా వీధుల్లో ముద్దులు పెట్టుకునే జంటలే. అందుకనే సొసైటీ ఛైర్మన్, సెక్రటరీలతో మాట్లాడి రోడ్డుపై నో కిస్సింగ్ జోన్ అంటూ పెయింటింగ్ చేయించామని తెలిపారు.

ముంబై నగరంలో ‘నో పార్కింగ్‘, ‘ఉమ్మివేయ వద్దు‘, ‘ధూమపానం చేయవద్దు’ లేదా ‘డ్రింకింగ్ జోన్’ అనేది సర్వసాధారణమని, అయితే ‘నో కిస్సింగ్ జోన్’అని రోడ్ల మీద రాయించారు.

కాగా..కరోనా కారణంగా పార్కులు మూతపడడం, సముద్రం ఒడ్డున కాసేపు సేద తీరే అవకాశం లేకపోవడంతో ముంబైలోని ప్రేమజంటలకు పెద్ద కష్టం వచ్చిపడింది. ఏకాంతంగా గడిపేందుకు సరైన చోటు లేక తమ ముద్దుమురిపాలకు తగిన చోటు లేకపోవడంతో ఓ కొత్త చోటును వెతుక్కున్నారు. అలా వారికి నగరంలోని బోరీవలీలో సత్యం, శివం, సుందరం సొసైటీ ఎదురుగా ఉన్న రహదారి వారికి చక్కని మార్గంగా కనిపించింది. సాయంత్రం ఐదు అయ్యిదంటే చాలు ప్రేమజంటలు రెక్కలు కట్టుకుని వచ్చి అక్కడ వాలిపోతున్నారు.

చీకటి పడేవరకు అక్కడే గడుపుతూ..ముద్దుముచ్చట్లలో తేలిపోతున్నారు. వీరి పనులు చూడలేక కాలనీ వాసులు తలలు పట్టుకుని ఎట్టకేలకు ఇలా నో కిస్సింగ్ జోన్ బోర్డులు పెట్టారు. ‘నో కిస్సింగ్ జోన్’ అని రోడ్డుపై రాయించారు. ఈ ఐడియా చక్కని ఫలితాన్నే ఇవ్వటంతో అక్కడికి వచ్చే జంటల సంఖ్య తగ్గింది. దీంతో సత్యం, శివం, సుందరం కాలనీవాసులు ఐడియా మంచి ఫలితాలు ఇవ్వటంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.