Telangana: 10 సభలు పెట్టినా బీజేపీని ఎవ‌రూ నమ్మరు: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి

సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వ‌హించిన స‌భ‌పై టీఆర్ఎస్ నేత‌, తెలంగాణ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనకుండా రాష్ట్ర రైతుల‌ను ఇబ్బందుల‌కు గురిచేసిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఇక్క‌డి అన్న‌దాత‌ల‌ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి విమ‌ర్శించారు. బీజేపీతో రాష్ట్రానికి చేకూరే ప్ర‌యోజ‌నాలు ఏమీలేవ‌ని ఆయ‌న చెప్పారు.

Telangana: 10 సభలు పెట్టినా బీజేపీని ఎవ‌రూ నమ్మరు: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి

Indrakaran Reddy

Telangana: సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వ‌హించిన స‌భ‌పై టీఆర్ఎస్ నేత‌, తెలంగాణ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ నేత‌లు ఇటువంటి 10 సభలు పెట్టినా ఆ పార్టీని ఎవ‌రూ నమ్మరని ఆయ‌న చెప్పారు. తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనకుండా రాష్ట్ర రైతుల‌ను ఇబ్బందుల‌కు గురిచేసిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఇక్క‌డి అన్న‌దాత‌ల‌ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి విమ‌ర్శించారు. బీజేపీతో రాష్ట్రానికి చేకూరే ప్ర‌యోజ‌నాలు ఏమీలేవ‌ని ఆయ‌న చెప్పారు.

bjp: డ‌బుల్ ఇంజ‌న్ ప్ర‌భుత్వం కోసం తెలంగాణ ప్ర‌జ‌లు ప‌ట్టాలు వేస్తున్నారు: మోదీ

తెలంగాణ‌కు ఈ ఎనిమిదేళ్ళ‌లో కేంద్ర స‌ర్కారు ఏం చేసింద‌ని ఆయ‌న నిల‌దీశారు. ఆ విష‌యాలు చెప్ప‌ని బీజేపీ నేత‌లు తెలంగాణ‌లో నీళ్ళు, నిధులు, నియామకాల గురించి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. 2014 ఎన్నిక‌ల ముందు మోదీ దేశంలోని యువ‌త‌కు ఉద్యోగాల‌పై హామీ ఇచ్చార‌ని, అధికారంలోకి వ‌స్తే ప్ర‌తి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పార‌ని ఆయ‌న అన్నారు. ఆ హామీని నెర‌వేర్చ‌లేద‌ని చెప్పారు. బీజేపీ అగ్ర‌నేత‌లు త‌మ గురించి తాము గొప్ప‌లు చెప్పుకోవ‌డం త‌ప్ప రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పలేదని ఆయ‌న అన్నారు.