No corona case : పర్యాటక ప్రాంతమైనా..ఒక్క కరోనా కేసు లేని గ్రామం..

No corona case : పర్యాటక ప్రాంతమైనా..ఒక్క కరోనా కేసు లేని గ్రామం..

No Corona Case

village without a single corona case : దేశంలో ఎటు వెళ్లినా కరోనానే కనిపిస్తోంది. ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు లేని ప్రాంతాలనువేళ్ల మీద లెక్కపెట్టవచ్చేమో. అటువంటి ఓ గ్రామం గురించి చెప్పుకుందాం. ఎన్నో కరోనా జాడలేని గ్రామాలు ప్రాంతాలు ఉన్నాగానీ..ఈ గ్రామానికి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది.అదేమంటే..అది పర్యాటక ప్రదేశం. అయినా ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఆ గ్రామమే హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో మ‌లానా అనే గ్రామం. మలానా గ్రామంలోకి కరోనా అడుగు పెట్టలేకపోయింది. దానికి కారణం.. గ్రామస్తులు అనుసరిస్తున్న సేఫ్టీ పద్ధతులు. ఏ ప్రభుత్వం వారిని ఇలా ఉండాలని..అలా ఉండలని చెప్పలేదు. కానీ మలానా గ్రామస్తులు మాత్రం తమ రక్షణ కోసం వారే నిర్ణయం తీసుకున్నారు. తమకు తాముగా ఆంక్షలు పెట్టుకుని కరోనాను తమ గ్రామ సరిహద్దుల్లోకి కూడా ఎవ్వరినీ రానివ్వడంలేదు.

మ‌లానా గ్రామస్తులంతా కోవిడ్ రూల్స్ ని చక్కగా అనుసరిస్తున్నారు. నిజానికి హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. కానీ.. అంతకంటే ముందే మలానా గ్రామస్థులు తమకు తామే ఆంక్షలు విధించుకున్నారు. పైగా మలానా ఓ ప్రముఖ పర్యాటక ప్రదేశంలోనే ఉండటం. అయినా కరోనా ఎంట్రీ ఇవ్వలేక పోయింది వారి ముందుస్తు జాగ్రత్తల వల్ల.

మ‌హ‌మ్మారి కార‌ణంగా ముందుగానే మలానా గ్రామస్తులు ప‌ర్యాట‌కులను త‌మ ఊరిలోకి రానివ్వలేదు. ఆ గ్రామానికి సంబంధించిన రోడ్లన్నీ మూసేశారు. అసలు.. కరోనా తమ గ్రామంలోకి ఎలా ఎంట్రీ ఇస్తుందో చూస్తాం అన్నట్లుగా అన్ని జాగ్రత్తలు పాటించారు. అలా ఇప్పటివరకు మలానా గ్రామంలో ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మలానా గ్రామస్థులు తమా గ్రామాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ గ్రామంలో ప్రభుత్వ నిర్ణయాలతో పనిలేకుండా ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాలను వారు ఏమాత్రం పట్టించుకోరు. మలానా గ్రామంలో ఒక్క ప్రభుత్వ స్కూల్ తప్ప మరే ఇతర ప్రభుత్వానికి సంబంధించిన ఏమీ ఉండవు. దటీజ్ మలానా అన్నట్లుగా ఉంది కదూ..