Telugu Movies: అన్ని ఎలిమెంట్స్ కాదు.. కొత్తగా కావాలంటున్న ప్రేక్షకులు!

టాప్ హీరో అయినా.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని రిలీజ్ టెన్షన్ ఫేస్ చెయ్యాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పుడు 5 సినిమాలతో ఎంగేజ్ అయ్యి ఉన్నారు. ఆల్రెడీ ఆచార్య రిలీజ్ రె

Telugu Movies: అన్ని ఎలిమెంట్స్ కాదు.. కొత్తగా కావాలంటున్న ప్రేక్షకులు!

Telugu Movies

Telugu Movies: టాప్ హీరో అయినా.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని రిలీజ్ టెన్షన్ ఫేస్ చెయ్యాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పుడు 5 సినిమాలతో ఎంగేజ్ అయ్యి ఉన్నారు. ఆల్రెడీ ఆచార్య రిలీజ్ రెడీగా ఉంటే.. మోహన్ రాజాతో గాడ్ ఫాదర్ చేస్తున్నారు. మెహర్ రమేష్ తో వేదాళం రీమేక్ భోళాశంకర్ షూటింగ్ స్పీడప్ చేశారు. బాబీతో మరో మాస్ మూవీ చేస్తున్నారు. వీటితో పాటు వెంకీకుడుములతో మరో సినిమా కమిట్ అయ్యారు. వీటిలో అన్నీ.. ఫాన్స్ కి కావల్సిన ఎలిమెంట్స్ తోనే ప్లాన్ చేసినా.. ఏమన్నా మిస్ అవుతున్నామేమో అంటూ మరోసారి స్క్రిప్ట్ ని, సీన్స్ ని రీచెక్ చేసుకుంటూనే ఉన్నారు అందరూ.

Telugu Movies Releases: సమ్మర్ లో హీటెక్కించబోతున్న సినిమా జాతర

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కూడా టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఒక సినిమాలో ఉన్నట్టు మరో సినిమాలో ఉంటే ఆడియన్స్ అస్సలు యాక్సెప్ట్ చెయ్యడం లేదు. ట్రిపుల్ఆఱ్ లో చరణ్ తనలోని మరో అగ్రెసివ్ యాంగిల్ చూపించారు కాబట్టి.. శంకర్ సినిమాలో కొత్తగా చూడాలనుకుంటారు ఫాన్స్. దాంతో చరణ్ ని నెవర్ బిఫోర్ గా చూపించాలని ప్లాన్ చేసుకుంటున్నరు శంకర్.

Telugu Movies: ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్!

ఈ సినిమాలే కాకుండా సౌత్ లో రాబోతున్న పెద్ద సినమాలు మణిరత్నం పొన్నియున్ సెల్వన్, సూర్య, అజిత్, కమల్ హాసన్, సినిమాలన్నీ భారీగానే తెరకెక్కుతున్నాయి. అయితే ప్రీవియస్ సినిమాల రిజల్ట్ ని బట్టి స్టోరీ బెటర్ మెంట్స్ చేసుకుంటూ.. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడుతున్నారు.

Telugu Dubbing Movies: నేషనల్ వైడ్ తెలుగు సినిమా డబ్బింగ్ మేళా

రజనీకాంత్ లాంటి సీనియర్ స్టార్లు కూడా ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి తమ సినిమాల్ని రొటీన్ గా కాకుండా ఆడియన్స్ ని నచ్చేలా మళ్లీ మళ్లీ స్టోరీని చెక్ చేసుకుంటున్నారు. ఇలా పెద్ద హీరోలైనంత మాత్రాన, పాన్ ఇండియా మూవీలైనంత మాత్రాన, వందల కోట్ల బడ్జెట్ పెట్టినంత మాత్రాన సనిమా హిట్ అవుతుందన్న గ్యారంటీ లేదు కాబట్టి.. పెద్ద సినిమా స్టార్లందరూ.. సినిమా రిలీజ్ రోజు వరకూ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో టెన్షన్ పడుతున్నవాళ్లే.