Not vaccinated ? : వ్యాక్సిన్ తీసుకోలేదా ? రేషన్, పెట్రోల్ కట్!

ఒక టీకా డోసు వేసుకున్న వారికి మాత్రమే రేషన్, పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని డీలర్లు, ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Not vaccinated ? : వ్యాక్సిన్ తీసుకోలేదా ? రేషన్, పెట్రోల్ కట్!

No Fuel And Ration

No Ration, Fuel : వ్యాక్సిన్ వేయించుకోలేదా ? అయితే..రేషన్, పెట్రోల్ కట్ చేయనున్నారు. వ్యాక్సిన్ తీసుకోకుంటే…నో రేషన్ అంటూ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై టి.సర్కార్ సీరియస్ అయ్యింది. వ్యాక్సిన్ మాత్రం తప్పకుండా వేయించుకోవాలని ప్రజలకు సూచించింది. కానీ..పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ప్రధానంగా ఒక డోస్ వేసుకుని..రెండో డోస్ వేసుకోని వారు చాలా మందే ఉన్నారు. వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు సూచిస్తున్నారు…ప్రజలు ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

Read More : Apartment: ఆసియాలో అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ ఇదే! ధర ఎంతో తెలుసా?

మహారాష్ట్రలో కూడా కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ జరుగుతోంది. అయితే..ఔరంగాబాద్ లో వ్యాక్సిన్ కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. మహారాష్ట్రలో 74 శాతం మంది టీకాలు వేయించుకుంటే..ఔరంగాబాద్ లో కేవలం 55 శాత్రంగా ఉంది. ఈ క్రమంలో..జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.

Read More : Throws Soup : సూప్ నచ్చలేదని..మేనేజర్ ముఖంపై పారబోసింది

కనీసం ఒక టీకా డోసు వేసుకున్న వారికి మాత్రమే రేషన్, పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని డీలర్లు, ఏజెన్సీలకు ఔరంగాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తప్పకుండా వ్యాక్సిన్ సర్టిఫికేట్ చూడాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై విపత్తు యాజమాన్య చట్టం, వ్యాధుల చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇలా చేస్తేనైనా..వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు ముందుకు వస్తారని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. మరి ఈ నిర్ణయంపై ఎలాంటి స్పందనలు వ్యక్తమౌతాయో చూడాలి.