NTR : నాన్న గారి ఆ సినిమాని రీమేక్ చేయాలనుంది

ఇంటర్వ్యూలో భాగంగా కీరవాణి పలు ప్రశ్నలు అడిగారు. ఎన్టీఆర్ ని మీ నాన్న గారి సినిమా ఏదైనా రీమేక్ చేయాలి అనుకుంటే ఏ సినిమాని రీమేక్ చేస్తావని అడిగారు. దీనికి ఎన్టీఆర్ సమాధానమిస్తూ....

NTR : నాన్న గారి ఆ సినిమాని రీమేక్ చేయాలనుంది

Seetayya

 

NTR :  రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో భారీగా రూపొందిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా మార్చ్ 25న రిలీజ్ అవ్వబోతుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు చిత్ర యూనిట్ కూడా భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లను సంగీత దర్శకుడు కీరవాణి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా కీరవాణి పలు ప్రశ్నలు అడిగారు. ఎన్టీఆర్ ని మీ నాన్న గారి సినిమా ఏదైనా రీమేక్ చేయాలి అనుకుంటే ఏ సినిమాని రీమేక్ చేస్తావని అడిగారు. దీనికి ఎన్టీఆర్ సమాధానమిస్తూ..”నాన్న గారు(హరికృష్ణ) చేసిన సినిమాల్లో మీరు సీతయ్య సినిమాకి మంచి సంగీతం అందించారు. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. వీలైతే సీతయ్య చిత్రాన్ని రీమేక్ చేయడానికి ఇష్టపడతాను. ఆ సినిమాలో ఇంటెన్సిటీ, హీరో క్యారెక్టరైజేషన్ చాలా అద్భుతంగా ఉంటాయి” అని అన్నారు.

RRR : చెర్రీ, తారక్‌లతో కలిసి నాటు నాటు స్టెప్ వేసిన అమీర్.. వైరల్ అవుతున్న వీడియో..

ఇక రామ్ చరణ్ ఇదే విషయంపై మాట్లాడుతూ.. ”సీతయ్యను ఇప్పుడున్న పరిస్థితులకు రాసి, మోడ్రన్ టచ్ ఇస్తే ఖచ్చితంగా అది జూనియర్ ఎన్టీఆర్‌కి బాగా వర్కవుట్ అవుతుంది” అని అన్నారు. మరి భవిష్యత్తులో ఈ సినిమా తెరపైకి వస్తుందేమో చూడాలి.