NTR30 : పవర్ఫుల్ టైటిల్ని ఫిక్స్ చేస్తున్న ఎన్టీఆర్.. ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న టైటిల్!
NTR30 టైటిల్ గురించి ఆసక్తికర న్యూస్ ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. ఎన్టీఆర్ బర్త్ డేకి అదే టైటిల్ ని అనౌన్స్ చేయబోతున్నారు.

NTR30 titled as devara announced on ntr birthday
NTR30 Title : జూనియర్ ఎన్టీఆర్ RRR తరువాత నటిస్తున్న సినిమా NTR30. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) విలన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం NTR30 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్ గురించి ఒక ఆసక్తికర న్యూస్ ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది.
NTR : ఎట్టకేలకి ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగం కాబోతున్న జూనియర్..
ఈ నెల 20వ తారీఖున ఎన్టీఆర్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజు మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి ‘దేవర’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు గాని, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టైటిల్ వైరల్ అవుతుంది. ఇక ఈ మూవీ షూటింగ్ విషయాన్ని వస్తే.. ఇటీవలే రెండు షెడ్యూల్స్ ని చిత్ర యూనిట్ పూర్తి చేసిన విషయం తెలిసిందే.
Tollywood : టాలీవుడ్ సినిమాలకు ఇతర ఇండస్ట్రీ మ్యూజిక్ డైరెక్టర్ల సంగీతం.. NTR30 టు Nani30..
తాజాగా ఈ మూవీ మూడో షెడ్యూల్ కి మేకర్స్ సిద్దమవుతున్నారట. హైదరాబాద్ లోని ఒక ప్రత్యేక సెట్ లో జరగబోయే ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. సుమారు 10 రోజులు పాటు ఈ షెడ్యూల్ జరగనుంది అని సమాచారం. ఇక ఈ సినిమాకి తమిళ రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది.