Cyclone Alert : మరో తుపాన్ ముప్పు..బీ అలర్ట్

మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఉత్తర అండమాన్ సముద్రం.. దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. రాగల 36 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.

Cyclone Alert : మరో తుపాన్ ముప్పు..బీ అలర్ట్

Cyclone

Odisha Weather Update : మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఉత్తర అండమాన్ సముద్రం.. దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. రాగల 36 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది నాలుగైదు రోజుల్లో తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర నుంచి రాయలసీమ మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర అండమాన్‌ సముద్రం, దాని పరిసర  ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది.

Read More : Anand Deverakonda : ఫస్ట్ టైమ్ ఛార్టెడ్ ఫ్లైట్‌‌లో.. అమ్మ భయం.. నాన్న ధైర్యం..

దీని ప్రభావంతో 2021, అక్టోబర్ 11వ తేదీ సోమవారం ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఉండటంతో.. ఇది తదుపరి నాలుగైదు రోజుల్లో మరింత బలపడి తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇది దిశ మార్చుకుని బర్మా మీదుగా ప్రయాణించనుంది. బర్మా సమీపానికి వెళ్లిన తర్వాత.. మళ్లీ దిశ మార్చుకుని దక్షిణ ఒడిశా వైపు రానుంది. ఫలితంగా ఈ తుపాను ప్రభావమంతా ఒడిశాపైనే ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read More : Viral letter : ఇంట్లో డబ్బుల్లేకపోతే తాళం ఎందుకేశారు? కలెక్టర్ ఇంట్లో చోరీ చేసిన దొంగల లేఖ

మరోవైపు రెండురోజుల్లో ఏపీ నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 17న రాష్ట్రాన్ని తాకాల్సిన ఈశాన్య రుతుపవనాలు 23, 24 తేదీల్లో వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో .. దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రాంతాల్లో కురిసే  అవకాశం ఉంది.