Telangana Cabinet: ఆయిల్ ఫామ్ సాగు.. పంటవేస్తే ఎకరాకు రూ.26 వేలు!

దేశంలో పామ్‌ ఆయిల్ వినియోగానికి.. పంట సాగుకు భారీ వ్యత్యాసాలు ఉండడంతో ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అయితే.. మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఆయిల్ ఫామ్ సాగుకు వాతావరణం అనుకూలిస్తుంది. ఆయా రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటి. అందుకే తెలంగాణ రైతులను ఈ పంట సాగు ప్రోత్సహించాలని కేసీఆర్ ప్రభుత్వం చాలాకాలంగా ప్రయత్నాలలో ఉంది.

Telangana Cabinet: ఆయిల్ ఫామ్ సాగు.. పంటవేస్తే ఎకరాకు రూ.26 వేలు!

Telangana Cabinet

Telangana Cabinet: దేశంలో పామ్‌ ఆయిల్ వినియోగానికి.. పంట సాగుకు భారీ వ్యత్యాసాలు ఉండడంతో ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అయితే.. మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఆయిల్ ఫామ్ సాగుకు వాతావరణం అనుకూలిస్తుంది. ఆయా రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటి. అందుకే తెలంగాణ రైతులను ఈ పంట సాగు ప్రోత్సహించాలని కేసీఆర్ ప్రభుత్వం చాలాకాలంగా ప్రయత్నాలలో ఉంది. కాగా.. ఈ మేరకు ఈ పంటకు ప్రోత్సాహకాలు.. ప్రభుత్వ విధివిధానాలను బుధవారం క్యాబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకుంది.

ఇందులో భాగంగా ఇకపై తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ఎకరాకు మొదటి సంవత్సరం రూ.26,000 రెండవ సంవత్సరం ఎకరాకు రూ.5000, మూడవ సంవత్సరం ఎకరాకు రూ.5,000 చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీగా అందచేయాలని నిర్ణయించింది. రానున్న 2022 – 23 సంవత్సరానికి 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించగా ఇందుకోసం భారీగా ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.

అటవీశాఖ, అటవీ అభివృద్ధి కార్పోరేషన్, పంచాయితీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ శాఖల సహాయంతో ఆయిల్ ఫామ్ మొక్కల నర్సరీలను పెంచాలని అధికారులకు సూచించిన క్యాబినెట్.. ఆయిల్ ఫామ్ పంట విధానం గురించి మరింతగా తెలుసుకోవడానికి మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులతో కూడిన అధ్యయన బృందం, కోస్టారికా, మలేషియా, థాయ్ లాండ్, ఇండోనేషియా తదితర దేశాలలో పర్యటన చేపట్టాలని నిర్ణయించింది. పంట పండిన అనంతరం ప్రోసెసింగ్ లో భాగంగా ప్రాసెసింగ్ యూనిట్లకు, టిఐడిఈఏ, టిఎస్ఎఫ్‌పిజెడ్ నిబంధనల ప్రకారం అందించే ప్రోత్సాహకాలు అందచేయాలని అధికారులకు క్యాబినెట్ సూచించింది.