White Tigress: ఢిల్లీ జూలో అతిపెద్ద తెల్ల పులి మృతి.. అనారోగ్యమే కారణమా?

వీణా రాణి మాత్రం 17 సంవత్సరాలకే అనారోగ్యంతో మరణించింది. ఈ విషయాన్ని ఢిల్లీ జూ అధికారులు వెల్లడించారు. వీణా రాణి లివర్ సంబంధిత సమస్యతో కొంతకాలంగా బాధపడుతోంది. ఇటీవల ఈ పులి రక్త నమూనాలు సేకరించిన అధికారులు పరిశీలనకు పంపారు.

White Tigress: ఢిల్లీ జూలో అతిపెద్ద తెల్ల పులి మృతి.. అనారోగ్యమే కారణమా?

Updated On : February 7, 2023 / 10:33 AM IST

White Tigress: అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన తెల్లపులి ఢిల్లీ జూలో సోమవారం మరణిచింది. వీణా రాణి అనే పేరున్న ఈ ఆడపులి వయసు 17. సాధారణంగా పులులు 20-25 ఏళ్లు బతకగలవు. కొన్ని మాత్రం 8-10 ఏళ్లకే మరణిస్తాయి. తెల్ల పులులు కూడా 20 సంవత్సరాలు జీవించగలవు.

Delhi: కబడ్డీ క్రీడాకారిణిపై కోచ్ అత్యాచారం.. బాధితురాలి ఫిర్యాదు.. ఢిల్లీ కోర్టులో విచారణ

వీణా రాణి మాత్రం 17 సంవత్సరాలకే అనారోగ్యంతో మరణించింది. ఈ విషయాన్ని ఢిల్లీ జూ అధికారులు వెల్లడించారు. వీణా రాణి లివర్ సంబంధిత సమస్యతో కొంతకాలంగా బాధపడుతోంది. ఇటీవల ఈ పులి రక్త నమూనాలు సేకరించిన అధికారులు పరిశీలనకు పంపారు. అక్కడ పులి హెపటైటిస్‌తో బాధపడుతున్నట్లు తేలింది. దీని కారణంగా వీణా రాణి లివర్ బాగా దెబ్బతింది. కొంతకాలంగా పులి సరిగ్గా ఆహారం తీసుకోవడం లేదు. శనివారం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోలేదని, చివరకు సోమవారం మరణించిందని అధికారులు తెలిపారు. వీణా వాణి మృతదేహానికి అధికారులు నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

Peru landslides: పెరూలో విరిగిపడిన కొండచరియలు.. 36 మంది మృతి

వీణా రాణి ఢిల్లీ జూలో జన్మించిన మూడో తరం తెల్ల పులి. ప్రస్తుతం ఈ జూలో టిప్పు, విజయ్, సీతా అనే మూడు తెల్ల పులులు కూడా ఉన్నాయి. వీటిలో విజయ్-సీత పులులకు మరో రెండు పులులు జన్మించాయి. కాగా, తెల్లపులులు చాలా అరుదైనవి. ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య చాలా తక్కువ. ఇటీవలి అంచనా ప్రకారం.. 200 వరకు మాత్రమే తెల్ల పులులు జీవించి ఉన్నాయి.