Ovarian Cancer : మహిళల్లో అండాశయ క్యాన్సర్…ఈ సంకేతాలుంటే జాగ్రత్త

మారుతున్న జీవనశైలి కారణంగా భారతదేశంలో అండాశయ క్యాన్సర్ వస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. జన్యుపరమైన అంశం కూడా దీనికి కారణమౌతుంది.

Ovarian Cancer : మహిళల్లో అండాశయ క్యాన్సర్…ఈ సంకేతాలుంటే జాగ్రత్త

One Old Hand Giving A Pink Ribbon To A Young Hand

Ovarian Cancer : రొమ్ము, అండాశయం,గర్భాశయ క్యాన్సర్ వంటి వాటిని ముఖ్యంగా మహిళలు చివరి దశల్లో గుర్తిస్తుంటారు. రొమ్ము క్యాన్సర్ , గర్భాశయ క్యాన్సర్ తర్వాత, అండాశయ క్యాన్సర్ భారతీయ మహిళల్లో అత్యధిక మందిలో వచ్చే స్త్రీ జననేంద్రియ క్యాన్సర్. ఇది చాలా నిశ్శబ్దకరమైన క్యాన్సర్. యూకెలోని క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం అండాశయంలోని అసాధారణ కణాలు పెరగడం , అనియంత్రిత మార్గంలో విభజించడాన్ని అండాశయ క్యాన్సర్ అంటారు. అవి చివరికి కణితి ఏర్పడటానికి దారితీస్తాయి. దీనిని ముందుగా గుర్తించకపోతే క్యాన్సర్ కణాలు క్రమంగా చుట్టుపక్కల కణజాలాలలోకి వ్యాప్తిచెంది శరీరంలోని ఇతర ప్రాంతాలకు క్యాన్సర్ వ్యాపించేందుకు దారీతీయవచ్చు.

గుర్గావ్‌లోని ఆర్టెమిస్ హాస్పిటల్స్‌లో సీనియర్ కన్సల్టెంట్  మెడికల్ ఆంకాలజీ డాక్టర్ ప్రియా తివారీ చెప్పిన ప్రకారం స్త్రీ జననేంద్రియ క్యాన్సర్ అత్యంత ప్రాణాంతకమైనది. ఇది స్త్రీలలో ఎక్కువగా కనిపించే క్యాన్సర్. వయస్సు. మనదేశంలో అండాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళల సంఖ్య రోజురోజు కు పెరుగుతుంది. వాస్తవానికి ఆలస్యంగా దీనిని గుర్తించటమే కారణం. దీని వల్ల ఈ అండాయ క్యాన్సర్ భారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటుంది.

రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో గైనకాలజికల్ మరియు జెనిటో యూరినరీ రేడియేషన్ ఆంకాలజీ చీఫ్ డాక్టర్ స్వరూప మిత్ర చెప్పిన వివరాల ప్రకారం అండాశయ క్యాన్సర్‌కు ముందస్తు కారకాలైన గర్భాశయ క్యాన్సర్,ఇతర క్యాన్సర్‌లకు చాలా భిన్నం ఉంది. స్థూలకాయం, నిశ్చల జీవనశైలి, కొవ్వు ఆహారం తీసుకోవడం, మధుమేహం, ఆలస్య వివాహాలు, పిల్లలు లేకపోవడం, ముందస్తు రుతుక్రమం, పోస్ట్ మెనోపాజ్ హార్మోన్ థెరపీ మొదలైనవి అండాశయ క్యాన్సర్ కు ముందస్తు కారకాలుగా చెప్తున్నారు.

మారుతున్న జీవనశైలి కారణంగా భారతదేశంలో అండాశయ క్యాన్సర్ వస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. జన్యుపరమైన అంశం కూడా దీనికి కారణమౌతుంది. ఐదు నుండి 10% క్యాన్సర్లు వంశపారంపర్యంగా ఉంటాయి. దీని అర్థం క్యాన్సర్ కలిగించే జన్యువులు కుటుంబాలలో వ్యాపిస్తాయి కాబట్టి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండవ అంశం శరీరంలోని హార్మోన్ల మార్పుల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు లేని ఆడవారిలో ఇది సర్వసాధారణంగా వస్తుంది. హార్మోన్ల అసమతుల్యతకు కారణమయ్యే స్థూలకాయం వల్ల కూడా ఈ క్యాన్సర్‌కు దారితీయవచ్చు..

అండాయ క్యాన్సర్ ఉన్నవారిలో అత్యంత సాధారణ లక్షణాలను కొన్ని కనిపిస్తుంటాయి. అజీర్ణం లేదా కడుపు నొప్పి, అలసట, మలబద్ధకం, వెన్నునొప్పి, సెక్స్ సమయంలో నొప్పి, ఋతు మార్పులు, పొత్తికడుపు వాపు, ఉబ్బరం, పొత్తికడుపు నొప్పి, తిన్న వెంటనే నిండుగా ఉన్నట్లుగా భావించడం, మూత్రవిసర్జన చేయాలనే కోరిక ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటి లక్షణాలన్నీ అండాశయ క్యాన్సర్ కు దారి తీస్తాయని గ్యారెంటీగా చెప్పలేరు. ఇలాంటి లక్షణాలు పదేపదే కనిపిస్తుంటే మాత్రం వైద్యుడిని సంప్రదించటం అవసరం. కేవలం 20% అండాశయ క్యాన్సర్ లు మాత్రమే ప్రారంభ దశలో కనిపిస్తాయి. స్క్రీనింగ్ పరీక్షల ద్వారా ప్రారంభ దశలో క్యాన్సర్ ని గుర్తించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానం మానేయడం, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ద్వారా స్త్రీ జననేంద్రియ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.