Abdomen Fats : అధిక బరువు, పొట్ట చుట్టూ కొవ్వులు బాధిస్తున్నాయా?

ఉదయాన్నే సాధారణ టీకి బదులుగా ఒక కప్పు గ్రీన్‌ టీ తాగడం వల్ల అందులో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు శరీరంలో జీవక్రియల పనితీరును వేగవంతం చేస్తాయి. తద్వారా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వులు సులభంగా కరుగుతాయి.

Abdomen Fats : అధిక బరువు, పొట్ట చుట్టూ కొవ్వులు బాధిస్తున్నాయా?

Fats Around The Abdomen (1)

Abdomen Fats : జీవనశైలిలో మార్పులు, మారిన ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, పని ఒత్తిడి , ఆందోళనల వల్ల శరీరంలో కార్టిసాల్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తవుతుంది. ఇది జీవక్రియల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపి శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. కారణమేదైనా కానీ, వయసుతో సంబంధం లేకుండా వేధిస్తున్న సమస్య అధిక బరువు, కొవ్వుల పెరుగుదల. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు అందరిని బాధిస్తున్న సమస్య. ఈ కొవ్వులను కరిగించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినప్పటికీ ఏమాత్రం ఫలితం ఉండదు. అయితే కొన్ని రకాల మార్పులు చేసుకుంటే సులభంగానే ఈ కొవ్వులను కరిగించుకోవచ్చు.

రోజువారీ అలవాట్లతోనే బెల్లీ ఫ్యాట్‌ను సులభంగా కరిగించుకోవచ్చు. అన్ని పోషకాలూ కలిగిన సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. ఫైబర్‌ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. పీచు ఎక్కువగా ఉండే నట్స్‌, గింజలు, బార్లీ, పండ్లులలో బెర్రీస్‌, కమలాఫలం, పుచ్చకాయ వంటివి, కాయగూరల్లో బ్రకలీ, క్యారట్‌, స్వీట్‌కార్న్‌ వంటివి, దుంపలాంటివి తీసుకోవటం మంచిది. పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించడంలో ఫైబర్‌ సాయపడుతుంది. ఫైబర్‌ సమృద్ధ ఆహారం వల్ల చాలాసేపటి వరకూ ఆకలి వేయదు. దీంతో మరింత ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సులభంగా బరువు తగ్గవచ్చు. దీనివల్ల పొట్ట చుట్టూ కొవ్వు తగ్గుతుంది. అధిక పీచు జీర్ణ వ్యవస్థకు కూడా మంచిది.

పండ్ల రసాలు మంచివని చాలా మంది మోతాదుకు మించి తాగేస్తుంటారు. మితిమీరి తాగడం వల్ల వాటిలో ఉండే చక్కెరలు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. అందుకే మితంగా తాగమంటున్నారు నిపుణులు. నూనెలో వేయించిన లేదా నూనెతో తయారు చేసిన పదార్థాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇలాంటి వాటిని తినటం వల్ల సైతం కొవ్వులు పేరుకు పోయి బరువు పెరుగుతారు. నూనె పదార్థాలను ఎక్కువగా తినకూడదు. డయాబెటిస్‌, గుండె జబ్బులు వచ్చేందుకూ ఇలాంటి ఆహారాలు కారణమౌతాయి. నూనె పదార్థాలను మానేయడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. వారంలో కనీసం ఒక రోజు అయినా ఉపవాసం ఉండాలి. రోజులో 6 గంటల పాటు మాత్రమే తిని, మిగతా 18 గంటల పాటు జీర్ణాశయాన్ని ఖాళీగా ఉంచే ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ను అనుసరించాలి. ఇలా చేస్తే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఉదయాన్నే సాధారణ టీకి బదులుగా ఒక కప్పు గ్రీన్‌ టీ తాగడం వల్ల అందులో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు శరీరంలో జీవక్రియల పనితీరును వేగవంతం చేస్తాయి. తద్వారా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వులు సులభంగా కరుగుతాయి. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో కార్టిసోల్‌ అనే హార్మోన్‌ విడుదలై.. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. కాబట్టి, ఒత్తిడిని వదిలించు కోవాలి. కుటుంబంతో, స్నేహితులతో సమయం గడపడం, యోగా, ధ్యానం ఒత్తిడిని కొంతమేర నివారిస్తాయి. నిద్రలేమి బరువు పెరగడానికి, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి ముఖ్య కారణం.

రాత్రుళ్లు ఏడెనిమిది గంటలు సుఖంగా నిద్ర పోవడం మంచిది. దీని వల్ల బరువు పెరగకుండా చూసుకోవచ్చు. రోజూ వ్యాయామం చేయడం వల్ల పొట్ట దగ్గర కొవ్వుతో సహా శరీరంలో ఉండే అదనపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది. చెమట పట్టేలా కసరత్తు చేసి హృదయ స్పందన రేటును పెంచాలి. దీనివల్ల కూడా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది. వేగవంతమైన నడక, స్కిప్పింగ్‌, జాగింగ్‌, ఏరోబిక్‌ వ్యాయామం వంటివి కూడా కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులు శరీరంలో జిడ్డులాగా పేరుకుపోయిన కొవ్వుల్ని కరిగించడంలో సహాయపడతాయి. కాబట్టి రోజుకో గుప్పెడు వాల్‌నట్స్‌ని స్నాక్స్‌ సమయంలో తీసుకోవడం మంచిది.