Cabbage Cultivation : క్యాబేజీ సాగులో యాజమాన్యం

నేల తయారి కొద్దిపాటి నీటి సౌకర్యంతోనే దీని సాగు చేసి ఎక్కువ లాభాలు పొందవచ్చు. సకాలంలో సరైన యజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులతో పాటు మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

Cabbage Cultivation : క్యాబేజీ సాగులో యాజమాన్యం

Cabbage Cultivation

Cabbage Cultivation : శీతాకాలంలో సాగు చేసే పంటల్లో క్యాబేజి ఒకటి. క్యాబేజీని ఉల్లిగడ్డకు ప్రత్యమ్న్యయంగా కూడా ఉపయోగించడం వల్ల ఇది ఉల్లి ధరలు అధికంగా ఉన్న సమయాల్లో క్యాబేజీ ధర కూడా పెరగటం జరుగుతుంది. ఈ పంటను పూర్తి విస్తీర్ణంలో ఒకేసారి కాకుండా విడతలవారిగా వేసుకోవడం మంచిది. క్యాబేజీ చల్లని, వాతావరణంలో తేమగా ఉన్న వాతావరణాలలో మంచి దిగుబడులను సాధించవచ్చు. ఈ పంటలో మంచి మెలకువ పద్ధతులను పాటించడం వల్ల అధిక దిగుబడులను సాధించి మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఈ పంటకు నల్లరేగడి నేలలు, ఎర్రనేలలు అనువైనవి. ఉదజని సూచిక PH విలువ 5.5 – 6.5 గా ఉన్న నేలలు సాగుకు అనువైనవి. క్యాబేజీ పంట వెయ్యడానికి ఎంచుకున్న నేలను 2 నుండి 3 సార్లు నేల వదులు అయ్యేలా దున్నుకోవాలి. చివరి దుక్కికి ముందు ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల పోటాష్ మరియు 40 కిలోల బాస్వరం వేసుకొని చివరి దుక్కిని కలియ దున్నుకోవాలి.

ఒక్క ఎకరానికి దేశవాళి రకం విత్తనాలు అయితే 300 గ్రాముల విత్తనాలు, సంకర రకం విత్తనాలు అయితే 100-150 గ్రాముల విత్తనాలు అవసరం పడుతాయి. విత్తేముందు ఒక్క 1 కిలో విత్తనానికి 3 గ్రా తైరం లేదా 3 గ్రా కార్బండిజంతో విత్తన శుద్ధి చేసుకొనవలెను. నారు పెంచుటకు నారు మడులను నేలకు దాదాపుగా 10 – 15 సెంటి మీటర్ల ఎత్తుగా మడులను చేసుకొని మడులపై అచ్చుగా గీతలు గీసుకొని విత్తనాలను వేసి మెత్తటి మట్టితో కప్పివేయ్యాలి. విత్తనాలకు నీటిని అందించి దానిపై వరిగడ్డిని పలుచగా వేసుకోవాలి. లేదా కోకోఫిట్ తో నింపిన ట్రేలలో విత్తుకోవడం మంచిది. ఈ ట్రేలలో విత్తుకోవడం వల్ల నారును ఆకూ తినే పురుగు ఆశించకుండా ఉంటుంది. ప్రతి రోజు నీటిని పైపాటుగా అందించాలి. నేలపై నారును పెంచే క్రమంలో మడులలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

సాగుకు అనువైన రకాలు ఇవే.. క్యాబేజి సాగు చేయాలనుకున్నపుడు వాటి రకాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందులో మేలు రకాలైనవి.. గోల్డెన్‌ (ఎసిఆర్‌ఇ) రకం, ఎర్లీ డ్రమ్‌ హెడ్‌ రకం, ప్రైడ్‌ అఫ్‌ ఇండియా రకం, లేట్‌ డ్రమ్‌ హెడ్‌ రకం మేలైనవి. విత్తనాలు నాటే ముందు నేల అదునుకు వచ్చేవరకు 4-5 సార్లు కలియదున్నాలి. 100 చ.మీ. విస్తీర్ణంలో, 25-30 గంపల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. విత్తనాలను సన్నని ఇసుకతో కప్పివేయాలి. విత్తనాలు మొలిచే వరకు రోజు నీరు పెట్టాలి. మొక్కలు మొలకెత్తిన తరువాత ఎండిన ఆకులను తీసివేయాలి. నారు కుళ్ళు తెగులు సోకకుండా లీటరు నీటికి 3 గ్రా. కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌తో నేలను తడపాలి. నారుమడిని ఆకు తినే పురుగు బారి నుంచి రక్షించేందుకు 2 మి.లీ. మలాథియాన్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

నేల తయారి కొద్దిపాటి నీటి సౌకర్యంతోనే దీని సాగు చేసి ఎక్కువ లాభాలు పొందవచ్చు. సకాలంలో సరైన యజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులతో పాటు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. క్యాబేజి కూరల్లోనే కాకుండా ప్రత్యేకంగా సలాడుగా కూడా ఉపయోగిస్తుంటారు. అందుకే దీనికి మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. దీని సాగుకు ముఖ్యంగా ఇసుకతో కూడిన బంక నెలలు, సారవంతమైన ఒండ్రు నేలలు అనుకూలం. చౌడు క్షార నేలలు పనికి రావు. స్వల్ప కాలిక రకాలను డిసెంబరు మొదటి పక్షం వరకు దీర్ఘకాలిక రకాలను డిసెంబరు మొదటి పక్షం నుంచి చివరివారం వరకు నాటుకోవచ్చు. ఎకరానికి సూటి రకాలు 300 గ్రా., హైబ్రిడ్‌ రకాలు 100-150 గ్రా. విత్తనాలు సరిపోతాయి. కిలో విత్తనానికి 3 గ్రా. థైరామ్‌ను కలిపి విత్తన శుద్ధిచేయాలి.

మొక్కలు నాటిన 24 నుండి 48 గంటల మధ్య ఒక్క ఎకరానికి 1.25 లీటర్ల పెండిమితలిన్ (లేదా) అలాక్లోర్ 1.2 లీటర్ల రసాయనాన్ని ఇసుకలో కలుపుకొని తేమ గల నేల మీద చల్లుకోవాలి. కానీ పిచికారి చెయ్యకూడదు పిచికారి చెయ్యడం వల్ల నాటిన మొక్కలపై ఈ రసాయనం పడి ప్రమాదానికి గురి అవ్వడం జరుగుతుంది.

చిడ పీడలు మరియు తెగుళ్ళు:

రెక్కల పురుగు : ఈ రెక్కల పురుగు ఆకుల అడుగు భాగంలోకి చేసి ఆకులను తిని వాటిని జల్లెడ వాలే మారుస్తాయి. దీని వల్ల కాయలు చిన్నగానే ఉండిపోతాయి లేదా కాయలు ఉండవు. నివారణకు తక్కువ మోతాదులో ఉంటె 5% వేప కషాయాన్నిపిచికారి చెయ్యాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటె 1 లీటర్ నీటికి 1.5 గ్రాముల ఎసిఫేట్ (లేదా) 0.3 మీ. లీ. స్పేనోశాడ్ పిచికారి చేసుకోవాలి.

పెను బంక ; పెనుబంక పురుగులు ఆకు అడుగు భాగాముకు చేరి మొక్కలోని రసాలన్ని పిల్చి పంటను నాశనం చేస్తాయి. దీని నివారణకు 1 లీటర్ నీటిలో 2 మీ.లీ మాలాథియాన్ (లేదా) లీటర్ నీటికి 2 మీ.లీ. డైమితోయేట్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

నారు కుళ్ళు తెగులు ; నారు యొక్క కాడలు కిందిభాగంలో కుళ్లిపోయి నేలకూలి మొక్కలు చనిపోతాయి. దీని నివారణ చర్యగా నారు మడులను ముందస్తుగా నేలకు కొంచం ఎత్తులో ఏర్పాటు చేసుకొని విత్తనాలను విత్తుకోవాలి. లేదా కోకోఫిట్ తో నింపిన ట్రేలలో మొక్కలను పెంచుకోవాలి. ఈ తెగులు ఆశించిన వెంటనే తెగులు బారిన పడ్డ మొక్కలను నారునుండి తొలగించాలి. నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

నల్లకుళ్ళు తెగులు ; ఈ నల్లకుళ్ళు సోకినా మొక్క యొక్క ఆకులు ముదురు గోధుమ రంగు చుక్కలు ఏర్పడి వాటి పరిమాణం క్రమంగా పెరుగుతు ఆకు మొత్తాన్ని విస్తరించి ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. దీని నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 5 మీ. లీ. స్త్రేప్టోసైక్లిన్ ను కలుపుకొని పిచికారి చేసుకోవాలి.