Money Notes: సరస్సులో కట్టల కొద్ది రూ.2000 నోట్లు: ఆశ్చర్యపోయిన స్థానికులు

అజ్‌మేర్ లోని అనసాగర్ సరస్సులో రూ.2000 నోట్లు తెలియాడుతున్నాయని స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది

Money Notes: సరస్సులో కట్టల కొద్ది రూ.2000 నోట్లు: ఆశ్చర్యపోయిన స్థానికులు

Notes

Money Notes: సరస్సులో కట్టల కొద్ది డాబు నోట్లు గుర్తించిన స్థానికులు..ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఈఘటన రాజస్థాన్ లోని అజ్‌మేర్ నగరంలో శుక్రవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అజ్‌మేర్ ఎస్పీ తెలిపిన వివరాలు మేరకు..అజ్‌మేర్ లోని అనసాగర్ సరస్సులో రూ.2000 నోట్లు తెలియాడుతున్నాయని స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన అనసాగర్ లేక్ వద్దకు చేరుకున్న పోలీసులు..నీటిలో తేలియాడుతున్న నోట్లన్నీ బయటకు తీశారు. కొన్ని నోట్లు కట్ట నుంచి విడిపోకుండా కవర్ చుట్టి ఉన్నాయి. నోట్లన్నీ ఏరిన పోలీసులు..వాటి విలువ లెక్కించే ప్రయత్నం చేశారు.

Also read:Cyclone Asani: బలపడిన వాయుగుండం.. నేడు తుపానుగా మారే చాన్స్

అయితే నోట్లన్నీ బాగా తడిచి ఉండడంతో లెక్కించడం అప్పటికి సాధ్యపడలేదని ఎస్పీ వివరించారు. అయితే మొత్తం విలువ సుమారు రూ.1 కోటి వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా నోట్లు ఇలా సరస్సులో విసిరేసి ఉంటారని..విచారణ అనంతరం వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే చెరువులో లభ్యమైన రూ.2000 నోట్లు అసలువా, నకిలీవా అనే సందేహం కూడా పోలీసులు లేవనెత్తారు. క్లూస్ టీం సహాయంతో పూర్తి విచారణ చేపట్టనున్నట్లు అజ్‌మేర్ ఎస్పీ బల్ దేవ్ సింగ్ పేర్కొన్నారు. అయితే పోలీసుల కంటే ముందుగానే చెరువులో నోట్లను గమనించిన స్థానికులు మాత్రం ఆ నోట్లు అసలైన డబ్బుగానే చెప్పుకొచ్చారు. నోటు పై ఆర్బీఐ ముద్రణ కూడా ఉన్నట్లు స్థానికులు చెప్పుకొచ్చారు.

Also Read:JP Nadda: చీకటి నుంచి వెలుగులోకి నడిపించిన భాష సంస్కృతం: జేపీ నద్దా