Paddy Issue : పీయూష్ గోయల్‌‌కు మంత్రి ఎర్రబెల్లి సవాల్

బీజేపీ ప్రభుత్వాలు రైతులకు చేసింది ఏంటో- టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో బహిరంగ చర్చ జరుపుదామని, హైదరాబాద్ వచ్చి తమతో చర్చలు జరపాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు...

Paddy Issue : పీయూష్ గోయల్‌‌కు మంత్రి ఎర్రబెల్లి సవాల్

Paddy (2)

Errabelli Challenges Piyush Goyal : ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రం – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ కొనసాగుతోంది. రాష్ట్రంలో పండిన వడ్ల విషయంలో మాటల తూటాలు పేలుతున్నాయి. యాసంగిలో పండిన పంట అంతా కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర సర్కార్ డిమాండ్ చేస్తుంటే… ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కేంద్రం ఎదురు దాడికి దిగుతోంది. కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవానికి హస్తిన బాట పట్టిన తెలంగాణ మంత్రులకు నిరాశే ఎదురైంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమైన మంత్రులు తెలంగాణ డిమాండ్లను కేంద్ర మంత్రి ముందుంచారు. మీటింగ్ అనంతరం మీడియా ముందుకు వచ్చిన పీయూష్ గోయల్.. తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై తెలంగాణ ప్రజాప్రతినిధులు ఒంటికాలిపై లేస్తున్నారు. 2022, మార్చి 25వ తేదీ శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు.

Read More : Nama Nageswararao : రాష్ట్ర విభజన నాటి నుంచి తెలంగాణకు అన్యాయం : నామా నాగేశ్వరరావు

బీజేపీ ప్రభుత్వాలు రైతులకు చేసింది ఏంటో- టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో బహిరంగ చర్చ జరుపుదామని, హైదరాబాద్ వచ్చి తమతో చర్చలు జరపాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు కావని, తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా మాటలు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలి అన్న బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రైతుల కోసం టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చే ఏ ఒక్క పథకానికి కేంద్రం సహకారం ఇవ్వడం లేదన్న మంత్రి ఎర్రబెల్లి..
రాష్ట్ర బీజేపీ నేతలు చిల్లరగా మాట్లాడుతున్నట్లు విమర్శించారు. కేసీఆర్ కొనకున్నా తాము వడ్లు కొంటామన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్..మాట తప్పారని తెలిపారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కొనాలని అంటున్నారని, రైతులను రెచ్చగొట్టే వడ్లు వేయించారని బీజేపీపై విమర్శలు చేశారు. వడ్లు కొనే వరకు ఢిల్లీ నుంచి తెలంగాణకు బీజేపీ నేతలు రావొద్దని సూచించారు. ఈ విషయంలో రైతులంతా ఏకం కావాలని, ఢిల్లీ తలలు వంచైనా వడ్లు కొనే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు మంత్రి ఎర్రబెల్లి.

Read More : Gutta Sukhendar Reddy : ధాన్యం విషయంలో కేంద్రం రైతులను ఇబ్బంది పెట్టొద్దు : గుత్తా సుఖేందర్ రెడ్డి

బీజేపీ నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, రైతుల ఆదాయం డబుల్ చేస్తానని చెప్పి…వారికి అన్యాయం చేసే విధమైన చట్టాలు తెచ్చారని విమర్శించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఉత్తర భారతదేశానికి ఒక నీతి – దక్షిణ భారత దేశానికి ఒక నీతిగా బీజేపీ పాటిస్తోందన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు చీము నెత్తురు ఉంటే…పీయూష్ గోయల్ నుంచి క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశఆరు. బీజేపీ ఎంపీలు రెచ్చగొట్టే మాటలు ఆపాలని సూచించారు. వడ్లను మాత్రమే ఎంఎస్పీ (MSP) ఇచ్చి కొనాలని, బీజేపీ విధానాలను తెలంగాణ ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.