Booster Dose : బూస్టర్ డోస్‌కు వారే అర్హులు

దేశంలో వచ్చే ఆదివారం నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కాకపోతే 18 ఏళ్లు పైబడినవారు బూస్టర్ డోస్ వేయించుకోవాలంటే కొంత రుసుముు చెల్లించాల్సి

Booster Dose : బూస్టర్ డోస్‌కు వారే అర్హులు

Paid Booster Dose Available From Sunday

Booster Dose :    దేశంలో  ఒమిక్రాన్ ఎక్స్ ఈ వేరియంట్  వచ్చిందనే వార్తల నేపధ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  వచ్చే ఆదివారం నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపింది.  కాకపోతే 18 ఏళ్లు పైబడినవారు బూస్టర్ డోస్ వేయించుకోవాలంటే కొంత రుసుముు చెల్లించాల్సి ఉంటుంది.

అన్ని ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఆదివారం నుంచి ఈ టీకాలు అందుబాటులో ఉంటాయి.  కోవిడ్ నివారణలో భాగంగా ప్రభుత్వం మొదటి, రెండో డోసు వ్యాక్సిన్లను ఉచితంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆరోగ్య కార్యకర్తలు, ప్రంట్ లైన్ సిబ్బంది, 60 ఏళ్లు దాటిన వాళ్ళకు తొలుత బూస్టర్ డోస్ ఇచ్చారు.

కానీ 60 ఏళ్ళ లోపు వారికి మాత్రం బూస్టర్ డోస్ ఉచితంగా ఇవ్వటంలేదు. దేశవ్యాప్తంగా 15 ఏళ్లు దాటిన వారిలో 96 శాతం మంది ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకున్నట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ తెలిపింది. రెండో డోసుకు బూస్టర్ డోసుకు మధ్య వ్యవధి 90 రోజులు ఉండాలని అధికారులు తెలిపారు.

Also Read : Cannabis Oil : సికింద్రాబాద్‌లో హ్యాష్ ఆయిల్ ముఠా అరెస్ట్