Pakka Commercial: పక్కా కమర్షియల్.. ఒకటి కాదు రెండు!
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’ ఇప్పటికే షూటింగి పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు మారుతి....

Pakka Commercial To Release In Two Ott Platforms
Pakka Commercial: మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’ ఇప్పటికే షూటింగి పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు అభిమానుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు మారుతి తనదైన మార్క్‌తో తెరకెక్కించాడు. కాగా ఈ సినిమాను జూలై 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.
Pakka Commercial : మ్యాచోస్టార్ కోసం మెగాస్టార్..
అయితే ఈ సినిమా రిలీజ్ తరువాత ఏ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా చూస్తున్నారు. కాగా.. ఈ సినిమా ఒకటి కాదు.. రెండు ఓటీటీ ప్లాట్‌ఫాంలపై స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. పక్కా కమర్షియల్ సినిమాపై నెలకొన్న బజ్ కారణంగా ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాతో పాటు నెట్‌ఫ్లిక్స్ కూడా భారీ రేటుకు దక్కించుకుందట. మారుతి-గోపీచంద్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఖచ్చితంగా ఆదరిస్తారని చిత్ర వర్గాలు నమ్ముతున్నాయి. అందుకే ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం రెండు దిగ్గజ ప్లాట్‌ఫాంలు పోటీ పడ్డాయి.
Pakka Commercial: ‘పక్కా కమర్షియల్’పై మెగా ప్రొడ్యూసర్ ప్రశంసలు!
ఇక వారు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అయిన 5 వారాల తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. మరి పక్కా కమర్షియల్ సినిమా థియేటర్స్‌తో పాటు ఓటీటీ నిర్వాహకులకు కూడా కమర్షియల్ సక్సెస్ ను అందిస్తుందని ఆశిద్దాం. ఈ సినిమాలో గోపీచంద్ సరసన అందాల భామ రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.