NTR 100 Years : రీ రిలీజ్‌ చేసినా 100 రోజులు ఆడే సినిమా.. పాతాళ భైరవి!

నందమూరి తారక రామరావు నటించిన 'పాతాళ భైరవి' తెలుగు సినీ చరిత్రలోని ఒక అద్భుతం. ఆ మూవీ ఇప్పుడు రిలీజ్ అయినా..

NTR 100 Years : రీ రిలీజ్‌ చేసినా 100 రోజులు ఆడే సినిమా.. పాతాళ భైరవి!

Paruchuri Gopala Krishna comments on senior NTR Patala Bhairavi movie

Updated On : May 11, 2023 / 6:39 PM IST

NTR 100 Years : నందమూరి తారక రామరావు శతజయంతి సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఎన్టీఆర్ నటించిన ‘పాతాళ భైరవి’ సినిమాను గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా వచ్చి 72 ఏళ్ళు పూర్తి అవుతుందని, కానీ ఇప్పుడు రీ రిలీజ్ చేసినా 100 రోజులు ఆడగలిగిన సత్తా ఉన్న సినిమా పాతాళ భైరవి అని చెప్పుకొచ్చారు. పాతాళ భైరవి ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదని, మూవీలోని ‘సాహసం సేయరా డింభకా’ వంటి డైలాగ్ నుంచి ప్రతి ఒక్కటి ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పుకొచ్చారు.

NTR 100 Years : ఎన్టీఆర్ తీరని కోరికగా ఆ సినిమా మిగిలిపోయింది.. ఏంటది?

పాతాళ భైరవిలో నటించిన ప్రతి ఒక్కరు జీవించేశారని. ఇక మాంత్రికుడిగా చేసిన యస్ వి రంగారావుని చూసి తను చాలా భయపడినట్లు గుర్తుకు చేసుకున్నారు. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ కి చాలా మంది అభిమానులు అయ్యారని తెలియజేశారు. ఆ సినిమా తీసిన దర్శకుడు కే వి రెడ్డి, నిర్మాతలు బి నాగిరెడ్డి, చక్రపాణి గొప్ప వాళ్ళు అంటూ కొనియాడారు. ఆ టైం లోనే అటువంటి సినిమా తియ్యడం ఒక అద్భుతమని, అలాంటిది దర్శకనిర్మాతలు.. ‘ధైర్యే సాహసే లక్ష్మి’ అనే ఒక్క మాటని తీసుకోని సినీ చరిత్రలో ఒక ప్రభంజనాన్ని సృష్టించారు అంటూ వెల్లడించారు.

NTR 100 Years : బాలకృష్ణ పెళ్ళికి వెళ్లని ఎన్టీఆర్.. రీజన్ ఏంటో తెలుసా?

ఆ సినిమా ముందు వరకు జానపద సినిమాలు అంటే అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకు వచ్చేవారని, కానీ పాతాళ భైరవి మూవీ నుంచి ఎన్టీఆర్ గుర్తుకు వచ్చేలా ప్రభావం చూపారని తెలియజేశారు. ఒక్క జానపధంలోనే కాదు పౌరాణికం, సాంఘికం, చారిత్రకం.. ఇలా ప్రతి దానిలో ఎన్టీఆర్‌ చెరిగిపోని ముద్ర వేశారని వెల్లడించారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీల్లో అందుబాటులో ఉంటే తప్పక చూడాలని ఇప్పటి జనరేషన్ వారికీ తెలియజేశారు.

NTR 100 Years : ఎన్టీఆర్ శివుడి వేషం.. నాగుపామే వచ్చి మెడకి చుట్టుకున్న కథ తెలుసా?

కాగా గత ఏడాది మే 28 నుంచే ‘శకపురుషుని శత జయంతి ఉత్సవాలు’ అంటూ సంవత్సరాది వేడుకలను బాలకృష్ణ (Balakrishna) మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా శత జయంతి అంకురార్పణ సభని కూడా చాలా ఘనంగా నిర్వహించారు.