Pawan Kalyan: బాలయ్య కోసం వస్తున్న పవన్.. టాక్ షోకు కాదండోయ్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్స్‌తో పాటు రాజకీయాల్లోనూ బిజీగా గడుపుతున్నారు. ఆయన త్వరలోనే నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్-2’ టాక్ షోకు గెస్టుగా రాబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు షూటింగ్ జరుపుకుంటుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.

Pawan Kalyan: బాలయ్య కోసం వస్తున్న పవన్.. టాక్ షోకు కాదండోయ్!

Pawan Kalyan As Guest For Balakrishna Veera Simha Reddy Pre-Release Event

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్స్‌తో పాటు రాజకీయాల్లోనూ బిజీగా గడుపుతున్నారు. ఆయన త్వరలోనే నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్-2’ టాక్ షోకు గెస్టుగా రాబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు షూటింగ్ జరుపుకుంటుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.

Pawan Kalyan : వీరసింహారెడ్డి‌తో భీమ్లా నాయక్ భేటీ..

అయితే ఇప్పుడు బాలయ్య కోసం పవన్ మరో అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ మూవీ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను పిలవాలని బాలయ్య అండ్ టీమ్ అనుకుంటున్నారట.

ఇటీవల వీరసింహారెడ్డి సెట్స్‌లో పవన్ సందడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో పవన్‌ను ఈ సినిమా ఈవెంట్‌కు పిలిస్తే, ‘వీరసింహారెడ్డి’ మైలేజ్ మరింత పెరుగుతుందని.. అభిమానుల్లో ఈ సినిమాపై క్రేజ్‌ను మరింతగా పెంచేయొచ్చని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి నిజంగానే వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ వస్తారా లేదా అనేది చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.