Vakeel Saab Trailer : పవర్‌స్టార్ పవర్ ప్యాక్డ్ ‘వకీల్ సాబ్’.. ట్రైలర్ చితక్కొట్టిందిగా!..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వకీల్ సాబ్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ తెరపై కనిపించనుండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Vakeel Saab Trailer : పవర్‌స్టార్ పవర్ ప్యాక్డ్ ‘వకీల్ సాబ్’.. ట్రైలర్ చితక్కొట్టిందిగా!..

Pawan Kalyan Vakeel Saab Thetrical Trailer

Updated On : March 29, 2021 / 7:09 PM IST

Vakeel Saab Trailer: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వకీల్ సాబ్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ తెరపై కనిపించనుండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సోమవారం సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘వకీల్ సాబ్’ ట్రైలర్‌ను థియేటర్స్‌లో ప్రదర్శించారు.

ట్రైలర్ రిలీజా, సినిమా రిలీజా అనేంత స్థాయిలో పవర్‌స్టార్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర హంగామా చేశారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించగా, బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు – శిరీష్ నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయిక కాగా నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల కీలకపాత్రల్లో న‌టిస్తున్నారు.

పవర్‌స్టార్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో చెలరేగిపోయారు.. హిందీ ‘పింక్’, తమిళ్ ‘నేర్కొండ పార్వై’ సినిమాలను మించి తెలుగు రీమేక్ ‘వకీల్ సాబ్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చెయ్యబోతుందని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. తన ఇమేజ్‌తో కేవలం ట్రైలర్‌తోనే సినిమాపై ఆకాశాన్నంటే స్థాయిలో అంచనాలు మరింత పెంచేశారు పవర్‌స్టార్. వేసవి కానుకగా ఏప్రిల్ 9న భారీ స్థాయిలో, వేలాది థియేటర్లలో ‘వకీల్ సాబ్’ రిలీజవుతోంది.