No Confidence Motion: 2023లో తన మీద అవిశ్వాస తీర్మానం పెడతారని 2019లోనే చెప్పిన ప్రధాని మోదీ

మణిపూర్‌లో జరిగిన హింసాకాండను ఉపయోగించి బీజేపీ ప్రభుత్వాన్ని నాలుగు రంగాల్లో ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి

No Confidence Motion: 2023లో తన మీద అవిశ్వాస తీర్మానం పెడతారని 2019లోనే చెప్పిన ప్రధాని మోదీ

NDA vs INDIA: కేంద్ర ప్రభుత్వం మీద విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి. అయితే తనపై 2023లో అవిశ్వాస తీర్మానం పెడతారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఐదేళ్ల క్రితం (2019)లో చెప్పడం గమనార్హం. దీనికి సంబంధించి లోక్‌సభలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తాజాగా వైరల్ అవుతోంది. వాస్తవానికి 2019లో కూడా ఇలాగే సార్వత్రిక ఎన్నికలకు ముందు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆ సందర్భంలోనే 2023లో కూడా ఇలాగే జరుగుతుందని మోదీ జోస్యం చెప్పారు.

Assam: ఫేస్‌బుక్ ప్రేమ.. మూడేళ్ల తరువాత భార్య, ఆమె తల్లిదండ్రులను హత్యచేసిన భర్త .. అసలేం జరిగిందంటే?

2019లో అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం ప్రధనామంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ ‘‘2023లో మళ్లీ అవిశ్వాసం పెట్టే అవకాశం వచ్చేలా మీరు సిద్ధం కావాలని నా తరపున శుభాకాంక్షలను పంపుతున్నాను’’ అని అన్నారు. అయితే మోదీ మాట్లాడుతుండగా.. ప్రభుత్వానికి అహంకారం పెరిగిందని ప్రతిపక్ష నాయకుడు ఖర్గే అన్నారు. దీనికి ప్రధాని మోదీ స్పందిస్తూ అహంకారం పర్యవసానంగా 2014 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ సంఖ్య ఒకేసారి 400 నుంచి 40కి పడిపోయిందని ఎద్దేవా చేశారు.

NDA vs INDIA: కాంగ్రెస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు ఆమోదం తెలిపిన లోక్‭సభ స్పీకర్ ఓం బిర్లా

లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగొయ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై లోక్‭సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగొయ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి లోక్‭సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. ఈ తీర్మానంపై చర్చకు ఆయన సమయం కేటాయించనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు సైతం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. రూల్ 198 (బి) కింద ఈ అవిశ్వాస నోటీసుపై చర్చ చేపట్టాలని ఎంపీ నామా కోరారు.

మణిపూర్‌లో జరిగిన హింసాకాండను ఉపయోగించి బీజేపీ ప్రభుత్వాన్ని నాలుగు రంగాల్లో ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమయ్యాయి. మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని మోదీ సభలో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష నేతలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం మండిపడ్డారు.