PM Modi : అమృత్ భారత్ స్టేషన్ పథకం.. దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్లలో అభివృద్ధిపనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన

ఇక తొలి విడతగా అభివృద్ధి చేసే జాబితాలో ఏపీలోని 18 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇందులో రూ.453 కోట్లతో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లకు కొత్త హంగులు అద్దనున్నారు.

PM Modi : అమృత్ భారత్ స్టేషన్ పథకం.. దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్లలో అభివృద్ధిపనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన

PM Modi - Amrit Bharat Station Scheme

PM Modi Launch Amrit Bharat Station Scheme : రైల్వే మార్గానికి ల్యాండ్ మార్క్ డేగా మారబోతుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 508 రైల్యే స్టేషన్ లలో అభివృద్ధి పనులను వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు.

స్థానిక సంస్కృతి, వారసత్వం నిర్మాణానికి అనుగుణంగా ఆయా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కేంద్రం మొత్తం రూ.25 వేల కోట్లను వెచ్చించనుంది. ఉదయం వర్చువల్ గా వీటికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

Earthquake : చైనాలో భారీ భూకంపం.. 74 ఇళ్లు నేలమట్టం

స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లకు మెరుగులు దిద్దడం, కొత్త మెరుగు సూచికల ఏర్పాటు, ఆధునిక మౌళిక వస్తువుల కల్పనకు నిధులు కేటాయింపు, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మొత్తం 1309 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఒకేసారి 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించనున్నారు.

ఇక తొలి విడతగా అభివృద్ధి చేసే జాబితాలో ఏపీలోని 18 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇందులో రూ.453 కోట్లతో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లకు కొత్త హంగులు అద్దనున్నారు. ఇందులో ఏపీలోని కర్నూలు, తుని, తెనాలి, అనకాపల్లి, అనకాపల్లి, తాడిపల్లి వంటి స్టేషన్లను ఎంపిక చేశారు.

BCCI: బీసీసీఐకి భారీ ఆదాయం.. వచ్చే ఐదేళ్లలో రూ.8,200 కోట్లు వచ్చే అవకాశం? ఎలా అంటే..

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణకు చెందిన 30 రైల్వే స్టేషన్లను ఆధునీకరించనుండగా వీటిలో మొదటి విడతగా 21 రైల్వే స్టేషన్లలలో ఇవాళ ప్రధాని మోదీ వర్చువల్ గా పనులను ప్రారంభించనున్నారు. తెలంగాణలో రూ.894 కోట్లతో రైల్వే ఆధునీకీకరణ పనులను మోదీ ప్రారంభించనున్నారు.