PM Modi: నాడు నేరగాళ్ల అడ్డా.. ఇప్పుడు క్రీడాకారుల గడ్డ : ప్రధాని మోదీ

సెంట్రల్, స్టేట్ ఏజెన్సీలు ఎస్పీజీ, యాంటీ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మరో ఐదుగురు కంపెనీలు, యూపీ పోలీసులు వేదిక వద్ద భద్రతను నిర్వహించారు.

PM Modi: నాడు నేరగాళ్ల అడ్డా.. ఇప్పుడు క్రీడాకారుల గడ్డ : ప్రధాని మోదీ

Pm Modi

PM Modi: యూపీలోని సర్దనా ప్రాంతానికి చెందిన సలావా, కైలీ గ్రామాల్లో రూ.700కోట్లు వెచ్చించి నిర్మించనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. సెంట్రల్, స్టేట్ ఏజెన్సీలు ఎస్పీజీ, యాంటీ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మరో ఐదుగురు కంపెనీలు, యూపీ పోలీసులు వేదిక వద్ద భద్రతను నిర్వహించారు.

వేదిక వద్ద దాదాపు 90నిమిషాల పాటు గడిపిన ప్రధాని.. 32మంది అథ్లెట్లతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1928, 1932, 1936లలో భారతదేశానికి గోల్డ్ మెడల్ అందించిన మేజర్ ధ్యాన్ చంద్ పేరుతో యూనివర్సిటీకి నామకరణం చేశారు. 1956లో పద్మభూషన్ అందుకున్న ఆయన పుట్టిన రోజైన ఆగష్టు 29నే నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటున్నాం.

ఈ కొత్త స్పోర్ట్స్ స్టేడియంలో సింథటిక్ హాకీ గ్రౌండ్, ఫుట్ బాల్ గ్రౌండ్, బాస్కెట్ బాల్, వాలీబాల్, హ్యాండ్ బాల్, కబడ్డీలకు ప్రత్యేక గ్రౌండ్లను రెడీ చేస్తున్నారు. టెన్నిస్ కోర్టు, జిమ్నాజియం హాల్, సింథటిక్ రన్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, మల్టీ పర్పస్ హాల్, సైకిలింగ్ వెలొడ్రోమ్ లాంటి సౌకర్యాలు ఏర్పాటుచేయనున్నారు.

ఇది చదవండి: అతి త్వరలో పూజారాకు రెస్ట్ ఖాయం

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. ‘ఒకప్పటి నేరస్థుల గడ్డ త్వరలో క్రీడాకారులకు అడ్డాగా మారబోతుంది. గతంలో నేరస్తులు మీరట్ పరిసర ప్రాంతాల్లో “ఖేల్‌ ఖేల్‌” అంటూ సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుకునేవాళ్లు. యోగి ప్రభుత్వం వచ్చాక ఆ నేరస్తులంతా ఇప్పుడు “జైల్‌ జైల్‌” అంటూ ఊసలు లెక్కబెడుతున్నారు’ అని ప్రధాని మాట్లాడారు.