Karnataka Election 2023 : కర్ణాటకలో మోదీ ఎన్నిక ప్రచారాలు .. 20 బహిరంగ సభల్లో ప్రసంగాలు

ఓటుబ్యాంకుపై మోదీ ప్రసంగం ప్రభావం చూపుతాయని కన్నడ బీజేపీ నేతలు భావిస్తున్నారు. దీంతో ప్రధాని మోదీ 20 బహిరంగ సభల్లోను రోడ్ షోల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు.

Karnataka Election 2023 : కర్ణాటకలో మోదీ ఎన్నిక ప్రచారాలు .. 20 బహిరంగ సభల్లో ప్రసంగాలు

Karnataka Elections 2023

Karnataka Election 2023: Karnatka Elections 2023: కర్ణాటక ఎన్నికల హీటో రోజురోజుకూ పెరుగుతోంది. గతంలోలా సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటం కాదు ఈ సారి డైరెక్టుగా ఎన్నికల్లో సత్తా చాటి అధికారం చేపట్టాలని బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈక్రమంలో టికెట్ దక్కని అసంతృప్తులు కాంగ్రెస్ లో చేరుతున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదు కాషాయదళం..ఉన్నవారు ఉంటారు పోయినవారు పోతారు అన్నట్లుగా ఉందీ బీజేపీ వ్యవహారం.  మునిగిపోయే నావలోకి చేరుతున్నారు మా నేతలు అంటూ కాంగ్రెస్ పై సెటైర్లు వేస్తున్నారు బీజేపీ నేతలు. ఇప్పటికే ఎన్నికల అభ్యర్థుల్ని ప్రటకించిన బీజేపీ తమ స్టార్ క్యాంపెయినర్ల లిస్టును కూడా విడుదల చేసింది. ఈ లిస్టులో ప్రధాని మోడీ మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా ఉన్నారు.

మొత్తం 40మంది క్యాంపెయినర్లను ప్రకటించిన బీజేపీ అధిష్టానం ఎన్నికల ప్రచారంలో తెలుగు నేతలను కూడా చేర్చింది. తెలుగు వారు నివసించే ప్రాంతాల్లో తెలుగువారితోనే క్యాంపెయిన్ చేయాలనే ఉద్ధేశ్యంతో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తెలుగువారికి చోటు ఇచ్చింది. ఇలా దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో అధికారం కోసం పక్కాగా ప్లాన్లు వేస్తోంది. తెలంగాణలో విజయం సాధించటానికి కర్ణాటక ఓ వార్మప్ గా భావిస్తోంది బీజేపీ. ఈ క్రమంలో ప్రధాని మోడీ రంగంలోకి దిగి కర్ణాటక ప్రజల్ని తనదైనశైలిలో మాటలతో వశం చేసుకోవాలని చూస్తున్నారు. ఓటుబ్యాంకుపై మోదీ ప్రసంగం ప్రభావం చూపుతాయని కన్నడ బీజేపీ నేతలు భావిస్తున్నారు. మే 10న జరగనున్న క్రమంలో ప్రధాని మోడీ ఈనెల 28 నుంచే కర్ణాటకలో ప్రచారం ప్రారంభించనున్నారు. దీని కోసం కర్ణాటక బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోడీ మొత్తం 20 బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.వారం రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. దీని కోసం కర్ణాటక బీజేపీ భారీ ఏర్పాట్లతో పాటు విజయం కోసం గట్టి కసరత్తులు చేస్తోంది.

కాగా..కర్ణాటక ఎన్నికల వేళ అధికార బీజేపీ స్టార్ క్యాంపెయినర్ జాబితా సిద్ధమైంది. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి సహా సమర్ధవంతులైన కేంద్రమంత్రులతో 40 మంది జాబితాను సిద్దం చేసిన వారికి యాక్షన్ ప్లాన్లను కూడా ఇచ్చేసింది. కర్ణాటక బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీతో రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో సభలు లేదా ర్యాలీలు నిర్వహించనటానికి పక్కా ప్లాన్స్ సిద్ధం చేసింది. సీఎం బసవరాజ్ బొమ్మై ప్రధాని మోదీ పర్యటన వివరాలు వివరిస్తు..రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని మోదీ పర్యటన దాదాపుగా ఖరారైందని తెలిపారు. పలు ప్రాంతాల్లో రోడ్ షోలు కూడా ఉంటాయన్నారు. కాగా..కర్టాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనున్నాయి. మే 13వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.