Narendra Modi : యుక్త వయస్సులో ఉన్నవారికి టీకాలు వేయటం పెంచాలి- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

కోవిడ్‌ను ఎదుర్కునేందుకు జిల్లా స్థాయిలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు.

Narendra Modi : యుక్త వయస్సులో ఉన్నవారికి టీకాలు వేయటం పెంచాలి- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Narendra Modi

Narendra Modi : కోవిడ్‌ను ఎదుర్కునేందుకు జిల్లా స్థాయిలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. యుక్త వయస్సులో ఉన్న వారికి మిషన్ మోడ్‌లో వ్యాక్సిన్ డ్రైవ్‌ను వేగవంతం చేయాలని ప్రధాని ఆదేశించారు. దేశంలో సెకండ్ వేవ్ తరువాత మరోసారి కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు..కోవిడ్ పరిస్థితులు, ప్రభుత్వ సన్నద్ధత పై ప్రస్తుతం దేశంలో కొవిడ్​-19 పరిస్థితులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొవిడ్​ విజృంభణపై సమీక్షించిన మోడీ… నియంత్రణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ, కేబినెట్​ కార్యదర్శి రాజీవ్​ గౌబా, హోం శాఖ సెక్రటరీ, రైల్వే బోర్డు సీఈఓ సహా ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీ వర్చువల్​ విధానంలో జరిగింది.. దేశంలో కోవిడ్ పరిస్థితులు,ప్రభుత్వ సంసిద్ధతపై సమీక్షించిన ప్రధాని మోడీ..జిల్లా స్థాయిలో తగిన ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచాలని అధికారులకు సూచించారు.

మిషన్ మోడ్‌లో యుక్త వయస్సులో ఉన్న వారి కోసం వ్యాక్సిన్ డ్రైవ్‌ను వేగవంతం చేయాలని ప్రధాని ఆదేశించారు. వైరస్ నిరంతరం అభివృద్ధి చెందుతున్నందున జన్యు శ్రేణితో సహా పరీక్షలు, టీకాలు మరియు ఔషధ జోక్యాలలో నిరంతర శాస్త్రీయ పరిశోధన అవసరం అని ప్రధాని సూచించారు. మారుమూల, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సంబంధిత మార్గదర్శకాల లభ్యతను కల్పించడానికి నాన్-కోవిడ్ ఆరోగ్య సేవలు, టెలిమెడిసిన్ ద్వారా ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని ప్రధాని అధికారులకు సూచించారు.

Also Read : YS Jagan Mohan Reddy : రేపు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ప్రారంభించనున్న సీఎం జగన్

రాష్ట్రాలలో కోవిడ్ పరిస్థితులు, కరోనాను ఎదుర్కొనేందుకు ఉత్తమ-పద్ధతులు, ప్రజారోగ్య ప్రతిస్పందనపై చర్చించడానికి సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు ప్రధానమంత్రి ఆదేశించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర వైద్య మంత్రి  సోమవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు.  ఈ సమావేశంలో కరోనా కట్టడితో సహా వ్యాక్సినేషన్  ప్రక్రియ ​పై సమీక్షించనున్నట్లు అధికారులు తెలిపారు.