Modi Cabinet Expansion : 81 మందితో మోదీ నూతన మంత్రివర్గం.. కొత్తగా 28మందికి చోటు..! తెలుగు రాష్ట్రాలకు ఛాన్స్ దక్కేనా?

ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మోదీ తన మంత్రివర్గాన్ని అతి త్వరలో విస్తరించనున్నట్టు తెలుస్తోంది.

Modi Cabinet Expansion : 81 మందితో మోదీ నూతన మంత్రివర్గం.. కొత్తగా 28మందికి చోటు..! తెలుగు రాష్ట్రాలకు ఛాన్స్ దక్కేనా?

Pm Modi Cabinet Expansion

PM Modi Cabinet Expansion : ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మోదీ తన మంత్రివర్గాన్ని అతి త్వరలో విస్తరించనున్నట్టు తెలుస్తోంది. రెండోసారి ప్రధానిగా పదవిని చేపట్టిన తర్వాత మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించడం ఇదే తొలిసారి. ఒకటి, రెండు రోజుల్లో మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని అంటున్నారు. 81 మందితో మోదీ నూతన మంత్రివర్గం కొలువుదీరనున్నట్టు సమాచారం.

నేడు లేదా రేపు నూతన మంత్రివర్గం ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం 53 మందితో ఉన్న మంత్రి వర్గం ఉండగా.. కొత్తగా మంత్రివర్గంలోకి మరో 28 మందికి మోదీ అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రివర్గ విస్తరణపై కసరత్తు పూర్తి అయింది. అమిత్ షా,జెపి నడ్డా  శాఖల పనితీరు సమీక్ష తరువాత తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. రెండు మూడు శాఖలు ఉన్నవారిని ఒక శాఖకు పరిమితం చేసే అవకాశం కనిపిస్తోంది.

మంత్రివర్గ విస్తరణలో బిజెపి మిత్రపక్షాలు, ఎన్నికలున్న రాష్ట్రాల నేతలకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మోదీ నూతన మంత్రివర్గంలో జేడీయూ, ఎల్జెపి, అప్నా దళ్ పార్టీలకు స్థానం దక్కే అవకాశం ఉంది. ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, అసోం, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నేతలకు చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. యూపి నుంచి వరుణ్ గాంధీ, రాంశంకర్ కథేరియా, జోషి, జాఫర్‌ ఇస్లాం, రీటా బహుగుణ జోషి ,అనిల్ జైన్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

జ్యోతిరాధిత్య సింథియా, సర్బానంద సోనోవాల్‌కు స్థానం దక్కనుంది. బీహార్ నుంచి సుశీల్ మోడీకి స్థానం లభించే అవకాశం ఉంది. బీజేపీ సీనియర్ నేత భుపేంద్ర యాదవ్ కు స్థానం కల్పించే అవకాశం కనిపిస్తోంది. జేడీయూ నుంచి లల్లాన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్, సంతోష్ కుష్వాహల పేర్లు పరిశీలన లో ఉన్నట్టు తెలుస్తోంది. లోక్ జన శక్తి పార్టీ నుంచి పశుపతి పరాస్‌కి స్థానం కల్పించే అవకాశం ఉంది.

జేడీయూ నుంచి లల్లాన్‌ సింగ్‌, రామ్‌నాథ్‌ ఠాకూర్‌, సంతోష్‌ కుశ్వాహాలకు కూడా చోటు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అప్నా దళ్ నుంచి అనుప్రియా పాటిల్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. తెలుగు రాష్ట్రాలకి కేంద్ర మంత్రి వర్గంలో స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీ నుంచి కేబినెట్‌లోకి ఎవరికి ఛాన్స్ లేదని తెలుస్తోంది. తెలంగాణ నుంచి మాత్రం సోయం బాపూరావు పేరు పరిశీలనలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.