agnipath: తెలంగాణ పోలీసుల అదుపులో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సుబ్బారావు

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన అగ్నిప‌థ్ ప‌థ‌కానికి వ్య‌తిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఆందోళ‌న‌లు చేయించ‌డానికి కుట్ర ప‌న్నారని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న కోచింగ్ సెంట‌ర్ నిర్వాహ‌కుడు సుబ్బారావును తెలంగాణ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

agnipath: తెలంగాణ పోలీసుల అదుపులో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సుబ్బారావు

Secunderabad Station Mastermind

agnipath: కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన అగ్నిప‌థ్ ప‌థ‌కానికి వ్య‌తిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఆందోళ‌న‌లు చేయించ‌డానికి కుట్ర ప‌న్నారని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న కోచింగ్ సెంట‌ర్ నిర్వాహ‌కుడు సుబ్బారావును తెలంగాణ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఐటీ విచారణ ముగియడంతో పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. పక్కా ప్ర‌ణాళిక‌తో ఆయ‌న‌ విద్యార్థులను రెచ్చగొట్టారు. ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆయ‌న తొమ్మిది శిక్ష‌ణా కేంద్రాల‌ను నడుపుతున్నారు.

agnipath: సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న యువకుడి ఆత్మహత్యాయత్నం

ఆర్మీ కోచింగ్ సెంటర్ పేరుతో ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2 లక్షల చొప్పున ఫీజు తీసుకుంటున్నారు. అభ్యర్థులు తన అకాడెమీలో చేరేలా ఫీజుల‌ను విడతల వారీగా చెల్లించే అవ‌కాశం క‌ల్పించారు. త‌న వద్ద శిక్షణ తీసుకుంటే ఉద్యోగానికి ఎంపిక గ్యారెంటీ అని హామీలు ఇచ్చేవారు. మొదట రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే చాలంటు అభ్యర్థులను ఆకర్షించేవారు. ఆర్మీకి ఎంపికైన అనంత‌రం మిగతా ఫీజు మొత్తాన్ని చెల్లించేలా అభ్యర్థులకు కొటేషన్ ఇచ్చేవారు. అయితే, గ్యారెంటీ కింద అభ్యర్థులకు చెందిన 10 వ తరగతి మెమోలను తన దగ్గరే పెట్టుకునేవారు.

Agnipath: అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని ఉప‌సంహ‌రించుకునే ప్ర‌సక్తేలేదు: అజిత్ డోభాల్

ఇప్పటికే ప్రాథమిక పరీక్షను అభ్య‌ర్థులు పూర్తి చేసుకున్నారు. ఇక రాత పరీక్ష పూర్త‌యితే అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో సుబ్బారావుకు ఫీజులు అందేవి. అయితే, రాత పరీక్ష లేదని చెబుతూ కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ ప‌థ‌కాన్ని ప్రకటించడంతో దాదాపు రూ.50 కోట్లు నష్టపోయారు. దీంతో ఎలాగైనా అభ్యర్థులను రెచ్చగొట్టి రాత పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ప్ర‌ణాళిక వేసుకున్నట్లు తెలిసింది. ప‌ల్నాడు జిల్లా రావిపాడు పంచాయతీ పరిధిలో లో బై పాస్ రోడ్‌లో సాయి అకాడెమీ మెయిన్ బ్రాంచ్ ఉంది. 3 రోజుల పాటు సాయి డిఫెన్స్ అకాడెమీలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. సోదాల్లో హార్డ్ డిస్క్‌లతో పాటు అనేక మంది అభ్యర్థుల 10 వ తరగతి మెమోలను స్వాధీనం చేసుకున్నారు.
మూడు రోజులుగా సుబ్బారావును ఐటీ అధికారులు విచారించారు. నిన్న విచారణ ముగియడంతో సుబ్బారావును తెలంగాణ‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.