Jubilee Hills Rape Case: పోలీసు కస్టడీలో నేడు నిందితుల విచారణ

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు పోలీసు కస్టడీలో ఉండగా, మరో ఇద్దరు నిందితుల కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది. దీంతో శనివారం ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు.

Jubilee Hills Rape Case: పోలీసు కస్టడీలో నేడు నిందితుల విచారణ

Jubilee Hills Rape Case

Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు పోలీసు కస్టడీలో ఉండగా, మరో ఇద్దరు నిందితుల కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది. దీంతో శనివారం ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు. కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను ఇప్పటికే కస్టడీలో రెండు రోజులు విచారించగా, నేడు మూడవ రోజు కూడా విచారణ సాగనుంది.

Covid Test: అమెరికా వచ్చే వాళ్లకు కోవిడ్ టెస్ట్ నిబంధన ఎత్తివేత

ముగ్గురు మైనర్ నిందితులను రెండవరోజైన శనివారం కూడా విచారిస్తారు. మిగిలిన ఇద్దరు నిందితులను ఈ రోజు నుంచి విచారిస్తారు. నిందితులకు కోర్టు ఐదు రోజుల కస్టడీ విధించింది. అయితే, జువైనల్ హోమ్‌లో విచారించేందుకు సరైన ఏర్పాట్లు చేయలేమని, ఈ విషయంలో కోర్టు ఆదేశాలు తమకు వర్తించవని జువైనెల్ హోమ్ అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు ఐదుగురు మైనర్ నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణ జరుపుతారు. మైనర్ నిందితులకు ప్రభుత్వ వైద్యులతో పొటెన్సీ టెస్ట్ (లైంగిక పటుత్వ పరీక్ష) చేయించాలని పోలీసులు భావిస్తున్నారు.

Balanced Diet : సమతుల్య ఆహారం ఎలా తినాలి?

ఈ కేసులో చార్జిషీటు వేయాలంటే పొటెన్సీ టెస్టు చేయించడం తప్పనిసరి. అందుకే ఈ టెస్టు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మైనర్ నిందితులను ఐడెంటిఫికేషన్ టెస్ట్ చేయించనున్నారు. నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే మనవడితోపాటు, మరో ఇద్దరు మైనర్స్ ఉన్నారు.