TS high court: విశ్వ విద్యాలయాల్లో రాజకీయాలా? ఓయూ రిజిస్ట్రార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

విశ్వ విద్యాలయాల్లో రాజకీయ కార్యక్రమాలకు అనుమతి ఇచ్చేది లేదంటూ తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఉంది. ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్శిటీలో...

TS high court: విశ్వ విద్యాలయాల్లో రాజకీయాలా? ఓయూ రిజిస్ట్రార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

Ts High Court

TS high court: విశ్వ విద్యాలయాల్లో రాజకీయ కార్యక్రమాలకు అనుమతి ఇచ్చేది లేదంటూ తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఉంది. ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్శిటీలో రాహుల్ గాంధీ నిరుద్యోగులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించేలా కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ ప్లాన్ చేసింది. అయితే అందుకు ఓయూ రిజిస్ట్రార్ నిరాకరించడంతో.. ఓయూ రిజిస్ట్రార్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మానవతా రాయ్‌, మరో ముగ్గురు అత్యవసరంగా హైకోర్టులో రాహల్ కార్యక్రమానికి అనుమతి కోరుతూ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓయూలో రాహల్ గాంధీ నిరుద్యోగులతో ముఖాముఖికి అనుమతిని హైకోర్టు నిరాకరించింది.

TS High Court : తెలంగాణ హైకోర్టుకు 10మంది కొత్త న్యాయమూర్తులు..నలుగురు మహిళలకు స్థానం

యూనివర్శిటీ క్యాంపస్‌ను రాజకీయ వేదికగా వినియోగించడం సరికాదని పేర్కొంది. ఈ క్రమంలో పిటీషనర్ స్పందిస్తూ.. గతంలో సీఎం జన్మదిన వేడుకలు, భాజపా మాక్ అసెంబ్లీ, జార్డిరెడ్డి జయంతి జరిగాయని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన హైకోర్టు గతంలో అనుమతించారన్న కారణంగా రాహుల్ గాంధీ ముఖాముఖీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని, ఓయూ పాలక మండలి తీర్మానానికి విరుద్దంగా అనుమతి ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సమానత్వ హక్కు పాజిటివ్ అంశాలకే నెగిటివ్ విషయాలకు కాదని తేల్చిచెప్పింది. రాహుల్ నిరుద్యోగులతో ముఖాముఖీ నిర్వహించే ఠాగూర్ ఆడిటోరియంకు 2 కి.మీ దూరంలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్న వాదన సరికాదని పిటీషనర్‌కు హైకోర్టు సూచించింది. అయితే యూనివర్శిటీలో ఏ కార్యక్రమం సరైందో, కాదో రిజిస్ట్రారే సరైన నిర్ణయం తీసుకోగలరని, ఓయూ రిస్ట్రార్ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది.

Congress: రాహుల్ పర్యటనపై అనవసర రాద్ధాంతం: మహేశ్ కుమార్ గౌడ్

యూనివర్శిటీలో విద్య, శిక్షణ, విజ్ఞాన కేంద్రాలుగా ఉండాలని, యూనివర్శిటీలోకి బయటి వ్యక్తులను అనుమతించరాదని హైకోర్టు అభిప్రాయ పడింది. రాజకీయ నేతలు, మాజీ విద్యార్థుల జన్మదిన వేడుకలకు అనుమతిస్తే వివక్ష ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతుందని, భవిష్యత్తులో అలాంటి కార్యక్రమాలకు అనుమతించొద్దని ఓయూ రిజిస్ట్రార్ కు హైకోర్టు హెచ్చరిక చేసింది. క్యాంపస్‌లో రాజకీయ కార్యక్రమాలను నిషేధించేలా సమగ్ర, స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని, విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండేలా యూనివర్శిటీలు చర్యలు తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకుండా ఇతర యూనివర్శిటీలు కూడా మార్గదర్శకాలు రూపొందించాలని హైకోర్టు తీర్పు కాపీలో పేర్కొంది.