Pooja Hegde : కాన్స్ చిత్రోత్సవానికి వెళ్తుండగా పూజాహెగ్డేకు చేదు అనుభవం.. పోలీసులకి కంప్లైంట్ చేసిన పూజా..

కాన్స్ చిత్రోత్సవంలో పూజా మీడియాతో మాట్లాడుతూ.. ''నాకు మొదటిసారి ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌కు ఆహ్వానం అందిందని చాలా సంతోషించాను. ఇక్కడ రెడ్‌ కార్పెట్‌పై మెరిసేందుకు పలు బ్యూటీ ప్రొడక్ట్స్‌, ఫ్యాషన్‌ దుస్తులను...............

Pooja Hegde : కాన్స్ చిత్రోత్సవానికి వెళ్తుండగా పూజాహెగ్డేకు చేదు అనుభవం.. పోలీసులకి కంప్లైంట్ చేసిన పూజా..
ad

Pooja Hegde :  ప్రస్తుతం ఫ్రాన్స్ లో ప్రఖ్యాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన తారలు రెడ్ కార్పెట్ పై సందడి చేస్తున్నారు. మన భారత తారలు కూడా పలువురు కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేస్తున్నారు. ఇక మన బుట్టబొమ్మ పూజాహెగ్డే కూడా ఈ కాన్స్ చిత్రోత్సవంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. రకరకాల డ్రెస్సులతో పూజా సముద్ర తీరాన, రెడ్ కార్పెట్ పై అలరించింది. ఆ ఫోటోలని సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసింది.

పూజా హెగ్డే మొదటిసారి ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంది. తాజాగా పూజాహెగ్డే ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. కాన్స్ చిత్రోత్సవంలో పూజా మీడియాతో మాట్లాడుతూ.. ”నాకు మొదటిసారి ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌కు ఆహ్వానం అందిందని చాలా సంతోషించాను. ఇక్కడ రెడ్‌ కార్పెట్‌పై మెరిసేందుకు పలు బ్యూటీ ప్రొడక్ట్స్‌, ఫ్యాషన్‌ దుస్తులను నా టీం స్పెషల్‌గా డిజైన్‌ చేసింది. అన్నిటిని కష్టపడి సిద్ధం చేసుకొని వచ్చాను, కానీ నా బ్యాగులు పోయాయి. ఇండియాలో చెకిన్ లో నా బ్యాగులు ఇచ్చాను, కానీ ఫ్రాన్స్‌ వచ్చాక ఆ బ్యాగులు కనిపించకుండ పోయాయి. ఇండియాలో అన్ని బ్యాగులు ఇచ్చాను అందులో నా మేకప్‌, దుస్తులకు సంబంధించిన బ్యాగ్స్‌ మాత్రం ఇక్కడికి వచ్చాక కనపడలేదు. అక్కడి ఎయిర్ పోర్ట్ లోనే నా బ్యాగులు పోయాయి. దీంతో ఫ్రాన్స్ కి వచ్చాక నేను, నా టీం కంగారు పడ్డాం.”

బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి సక్సెస్ సెలబ్రేషన్స్

”ఇక్కడ రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ చేసేందుకు అవసరమైన దుస్తులు లేకపోయేసరికి కంగారు పడ్డాను. బట్టలు, హెయిర్ ప్రొడక్ట్స్, మేకప్ కిట్లు అన్నీ పోయాయి. నా టీంకి మేకప్‌ సామన్లు, దుస్తులు కొని తీసుకురమ్మని చెప్పాను. అప్పటికప్పుడు కొనుక్కొని వచ్చి రెడీ అయ్యాను. ఆ టెన్షన్ లో ఆ రోజంతా సరిగ్గా తినలేదు. ఇక ఇండియాలో నాకు తెలిసినవాళ్ళకి ఫోన్ చేసి అక్కడి ఎయిర్పోర్ట్ లో పోలీసులకి కంప్లైంట్ ఇప్పించాను. అక్కడి సిబ్బందిని కూడా లగేజ్ ని చెక్ చేయమని చెప్పించాను అని తెలిపింది. మొత్తానికి పూజాకి మర్చిపోలేని అనుభవం ఎదురైంది. మరి ఆ మేకప్ కిట్స్, డ్రెస్ లు ఉన్న బ్యాగ్స్ దొరుకుతాయా లేదా చూడాలి.