Prabhas: సోలోగా కానిచ్చేస్తున్న ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ మూవీ ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్....

Prabhas: సోలోగా కానిచ్చేస్తున్న ప్రభాస్..?

Prabhas To Shoot Solo For Next Schedule Of Project K

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ మూవీ ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. కానీ కథలో దమ్ములేకపోవడంతో ఈ సినిమా జనాలకు ఎక్కలేదు. ఇక ఈ సినిమా ఫెయిల్యూర్ నుండి బయటపడ్డ ప్రభాస్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు.

Prabhas : ప్రశాంత్ నీల్ సూపర్ ప్లాన్.. ‘సలార్’కి కూడా ఆ యంగ్ ఎడిటర్??

ఇప్పటికే ఆదిపురుష్ సినిమాలో నటిస్తూ, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు డార్లింగ్. అటు కేజీయఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సలార్ అనే సినిమాను కూడా రెడీ చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. అయితే ఈ సినిమాలతో పాటు మహానటి ఫేం దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ ఓ యూనివర్సల్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ‘ప్రాజెక్ట్ K’గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కూడా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా, దీపికా, అమితాబ్‌లకు సంబంధించిన కొంతమేర షూటింగ్‌ను వారు పూర్తి చేశారు. ఇక తాజాగా ప్రభాస్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ K నెక్ట్స్ షెడ్యల్‌ను మే నెలలో స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తోందట. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ సోలోగా పాల్గొంటాడని, ఆయన పాత్రకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.

Prabhas : అందరూ నా పెళ్లి గురించే అడుగుతారు..

పూర్తిగా సైన్స్ ఫిక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడట. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ రెడీ చేస్తోంది. ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ ఓ అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేయగా, ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.