Prabhas : బాలకృష్ణకి జోశ్యం చెప్పిన ప్రభాస్.. అన్‌స్టాపబుల్‌ స్నీక్ పీక్ చూశారా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కంటే ముందు ప్రభాస్-బాలయ్య అన్‌స్టాపబుల్‌ సెలెబ్రేషన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్ ని న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30న ప్రసారం చేయనున్నారు నిర్వాహకులు. అయితే ఇంకా వారం రోజులు సమయం ఉండడంతో ఆహా టీం అభిమానులు కోసం ఒక స్నీక్ పీక్ విడుదల చేసింది.

Prabhas : బాలకృష్ణకి జోశ్యం చెప్పిన ప్రభాస్.. అన్‌స్టాపబుల్‌ స్నీక్ పీక్ చూశారా?

Prabhas : రెండు తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కంటే ముందు ప్రభాస్-బాలయ్య అన్‌స్టాపబుల్‌ సెలెబ్రేషన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్‌ విత్ NBK’ టాక్ షో విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక షో సెకండ్ సీజన్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని తీసుకు రావడంతో ఈ ఎపిసోడ్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యిపోయింది. ఇప్పుడికే ఈ ఎపిసోడ్ ప్రోమోలు చూసిన ప్రేక్షకులు అసలు ఎపిసోడ్ ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు.

Balakrishna : కంగనా రనౌత్ కి పద్మశ్రీ వచ్చింది నీకెందుకు రాలేదు?

ఈ ఎపిసోడ్ ని న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30న ప్రసారం చేయనున్నారు నిర్వాహకులు. అయితే ఇంకా వారం రోజులు సమయం ఉండడంతో ఆహా టీం అభిమానులు కోసం ఒక స్నీక్ పీక్ విడుదల చేసింది. ఆహాలో దర్శకుడు అనిల్ రావిపూడి జడ్జిగా, సుధీర్ అండ్ దీపికా పిల్లి వ్యాఖ్యాతులుగా వ్యవహరిస్తున్న ‘కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్’ షో ఎపిసోడ్ లు నిన్న విడుదల కాగా, చివరి ఎపిసోడ్ లో ప్రభాస్ ఎపిసోడ్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ సీన్ ని జత చేస్తూ రిలీజ్ చేశారు.

రెండు నిముషాలు పాటు ఉన్న ఈ స్నీక్ పీక్ లో ప్రభాస్ తో బాలయ్య.. నన్ను కూడా డార్లింగ్ అంటూ పిలవాలి అని కోరగా, సరే డార్లింగ్ సర్ అంటూ ప్రభాస్ పిలిచాడు. అది విన్న బాలయ్య ఇవన్నీ భీమవారం తెలివితేటలు అంటూ కౌంటర్ వేశాడు. ఆ తరువాత ప్రభాస్‌ని.. ‘నువ్వు జోశ్యం చెప్పే పాత్ర పోషించావు కదా, మరి ఇప్పుడు వచ్చే పదేళ్లలో నా జీవితం ఎలా ఉంటాదో చెప్పాలి’ అంటూ బాలయ్య అడిగాడు. దీంతో బాలయ్య చెయ్యి చూసిన ప్రభాస్.. అరే అన్‌స్టాపబుల్‌‌గా ఉంది సర్ అంటూ జోశ్యం చెప్పాడు. అయితే బాలకృష్ణ చెయ్యి మీద అన్‌స్టాపబుల్‌‌ అని రాసుకోవడం విశేషం.