Prakash Raj: ప్రధానికి ఇన్‌సోమ్నియా జబ్బు! ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!

కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై ఏ మాత్రం ఛాన్స్ దొరికినా భారీ విమర్శలకు దిగే విలక్షణ నటుడు ప్రకాష్..

Prakash Raj: ప్రధానికి ఇన్‌సోమ్నియా జబ్బు! ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!

Prakash Raj

Updated On : March 23, 2022 / 4:52 PM IST

Prakash Raj: కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై ఏ మాత్రం ఛాన్స్ దొరికినా భారీ విమర్శలకు దిగే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి సంచలన విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ఇన్సోమ్నియా అనే జబ్బుతో బాధపడుతున్నారని.. బీజేపీ నేతలు ముందు ఆయనకు చికిత్స అందించాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈమధ్యనే మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్‌ సోషల్‌ మీడియా వేదికగా ఈ వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు.

Prakash Raj : రాజ్యసభకు టీఆర్ఎస్ తరపున విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌?

ఓ సమావేశంలో మాట్లాడిన చంద్రకాంత్ పాటిల్‌.. మన ప్రధాని మోదీ రెండు గంటలే నిద్రపోతారని, ఒక రోజులో 22 గంటల పాటు ఆయన పనిచేస్తుంటారని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్‌ సెటైరికల్‌గా స్పందించాడు. దయచేసి కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి. నిద్రపోలేకపోవడం అనేది ఓ జబ్బు. వైద్య పరిభాషలో దీన్ని ఇన్సోమ్నియా అంటారు. దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఆ జబ్బుతో బాధపడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి’ అంటూ రాసుకొచ్చాడు.

Prakash Raj : వారం రోజుల పాటు మౌనవ్రతం : ప్రకాష్ రాజ్

దీంతో ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఇదే కాదు.. ఈ మధ్యనే కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై కేంద్ర ప్రభుత్వం నుండి బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాల వరకు రాయితీలు ప్రకటించి అభినందించడంపై కూడా ప్రకాష్ తీవ్రంగానే స్పందించిన సంగతి తెలిసిందే. నిర్మాతగా మారిన సుప్రీం యాక్టర్ కాశ్మీర్ ఫైల్స్ లాగానే గోధ్రా ఫైల్స్, ఢిల్లీ ఫైల్స్, జీఎస్టీ ఫైల్స్, డిమానిటషన్స్ ఫైల్స్, కోవిడ్ ఫైల్స్, గంగా ఫైల్స్ కూడా తీస్తారా అని ప్రశ్నించాడు.