Prasanna Kumar : ఇండస్ట్రీకి పెద్ద ఎవరూ లేరు.. చిరంజీవి జగన్ కలయిక ఇండస్ట్రీకి సంబంధం లేదు..

తాజాగా ఇవాళ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో అన్ని క్రాఫ్ట్స్ కి సంబంధించిన మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కి 24 క్రాఫ్ట్స్ నుంచి 240 మందికి ఆహ్వానం పంపినా వంద మంది లోపే హాజ‌ర‌య్యారు...

Prasanna Kumar : ఇండస్ట్రీకి పెద్ద ఎవరూ లేరు.. చిరంజీవి జగన్ కలయిక ఇండస్ట్రీకి సంబంధం లేదు..

Prasanna

Chiranjeevi :  ఇటీవల సినీ పరిశ్రమ సమస్యల కోసం చిరంజీవి మరికొంతమంది ప్రముఖులు వెళ్లి జగన్ ని కలిసిన సంగతి తెలిసిందే. చిరంజీవి కరోనా వచ్చినప్పటి నుంచి సినీ పరిశ్రమ సమస్యలని తన భుజాలపై వేసుకొని పరిష్కారం కోసం రెండు ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నారు. ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకోకుండా, ఆ పదం కూడా నాకు వద్దు అని పరిశ్రమ కష్టాల్లో ఉంటే వస్తాను అని చెప్పి ముందుంటున్నారు. కానీ పరిశ్రమలో కొంతమంది మాత్రం చిరంజీవిని తప్పుపడుతూ మాట్లాడుతున్నారు. అయన పర్సనల్ గా కలిసి మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీకి సంబంధం లేదు లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా ఇవాళ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో అన్ని క్రాఫ్ట్స్ కి సంబంధించిన మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కి 24 క్రాఫ్ట్స్ నుంచి 240 మందికి ఆహ్వానం పంపినా వంద మంది లోపే హాజ‌ర‌య్యారు. సినీ పరిశ్ర‌మ‌లో స‌మ‌స్య‌ల గురించి చర్చిస్తారు అని వార్తలు వచ్చినా అవేమి జరగలేదని తెలుస్తుంది. అయితే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నిర్మాతల మండలికి సంబంధించిన ప్ర‌స‌న్న కుమార్‌ మీడియాతో మాట్లాడారు.

Tollywood : ముగిసిన టాలీవుడ్ కీలక సమావేశం..

నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ”నిర్మాత‌ల మ‌ధ్య ఉన్న అంత‌ర్గ‌త ఇబ్బందులు, స‌మ‌స్య‌ల గురించే చర్చించాం. అందుకే ఈ మీటింగ్. సినీ ఇండ‌స్ట్రీకి పెద్ద అంటూ ఎవ‌రూ లేరు. ఫిల్మ్ ఛాంబ‌ర్ మాత్ర‌మే ఇండ‌స్ట్రీ పెద్ద. చిరంజీవి ఆధ్వ‌ర్యంలో ప్ర‌భాస్‌, మ‌హేష్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ ఇలా వెళ్లి కలిశారు. వారు వ్య‌క్తిగ‌తంగా, వారికి ఉన్న ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి వెళ్లి కలిశారు. దానికి ఇండ‌స్ట్రీకి సంబంధం లేదు” అని అన్నారు. దీంతో మరోసారి ఈయన వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.