NTR31: ఎన్టీఆర్‌తో సినిమాను అప్పుడే మొదలుపెడతానంటోన్న ప్రశాంత్ నీల్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో ఈ సినిమా రానుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక అతి త్వరలో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నట్లు తారక్ ఇటీవల అనౌన్స్ చేయడంతో అభిమానులు ఈ సినిమా కోసం అప్పుడే ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

NTR31: ఎన్టీఆర్‌తో సినిమాను అప్పుడే మొదలుపెడతానంటోన్న ప్రశాంత్ నీల్..?

Prashant Neel To Start Shoot Of NTR31 From This Time

Updated On : February 13, 2023 / 5:10 PM IST

NTR31: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో ఈ సినిమా రానుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక అతి త్వరలో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నట్లు తారక్ ఇటీవల అనౌన్స్ చేయడంతో అభిమానులు ఈ సినిమా కోసం అప్పుడే ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

NTR30: తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ.. జాన్వీ కపూర్ కాదట!

ఈ సినిమా తరువాత తారక్ తన కెరీర్‌లోని 31వ చిత్రాన్ని కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గతంలోనే రిలీజ్ చేయగా, దానికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ 31వ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ డిసెంబర్ 2023లో షూటింగ్ మొదలుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడట.

Prashanth Neel On NTR31: ఎన్టీఆర్ సినిమాపై ప్రశాంత్ నీల్ క్లారిటీ!

ఈ సినిమా షూటింగ్’ను వచ్చే ఏడాది మొత్తం జరపాలని, 2024 చివరినాటికి ఈ సినిమా షూటింగ్‌ను ముగించేయాలని ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నాడట. ఇక ఈ సినిమాలో తారక్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాతో తారక్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు ప్రశాంత్ నీల్ పక్కా ప్లానింగ్‌తో రెడీ అవుతున్నాడట. ఈ సినిమాకు అసుర లేదా అసురుడు అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తారని ఫిలిం సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈయేడాది చివరికల్లా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నాడనే వార్తతో తారక్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.