NTR31: బ్లాక్ ఫాంటసీతో హోరెత్తిస్తున్న ప్రశాంత్ నీల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో నేడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తారక్ మేనియానే కనిపిస్తుంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో....

NTR31: బ్లాక్ ఫాంటసీతో హోరెత్తిస్తున్న ప్రశాంత్ నీల్!

Prashanth Neel Continues Black Fantasy With Ntr31 In First Look Posters

NTR31: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో నేడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తారక్ మేనియానే కనిపిస్తుంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఆడియెన్స్‌ను కట్టిపడేసిన ఈ హీరోకు బర్త్‌డే విషెస్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇక తన అభిమానులకు తారక్ కూడా అదిరిపోయే ట్రీట్‌లు ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. నిన్న సాయంత్రం దర్శకుడు కొరటాల శివతో తాను చేయబోయే చిత్రానికి సంబంధించి ఫ్యూరీ ఆఫ్ ఎన్టీఆర్30 అంటూ ఓ వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేసి అదరగొట్టాడు.

NTR31: బాబోయ్ ప్రశాంత్ నీల్.. తారక్ ఊరమాస్ లుక్ వచ్చేసింది!

ఇక ఇవాళ మధ్యాహ్నం ఎన్టీఆర్ 31వ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా, ఓ పవర్‌ఫుల్ ఊరమాస్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌తో ఒక్కసారిగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు. ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజీయఫ్, కేజీయఫ్2 చిత్రాలతో ఇండియావైడ్ గుర్తింపును తెచ్చుకోగా, తన నెక్ట్స్ మూవీగా ‘సలార్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా నటనతో విధ్వంసం సృష్టించే ఎన్టీఆర్‌తో సినిమా అనౌన్స్ చేయడంతో, అప్పుడే ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే అంచనాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. అయితే ఈ పోస్టర్‌ను చూస్తే, ప్రశాంత్ నీల్ తాను తెరకెక్కించిన ప్రతి సినిమాకు ఈ పోస్టర్ కూడా లింక్ అయినట్లు కనిపిస్తుంది.

Salaar: వైలెన్స్.. వైలెన్స్.. సలార్‌లో కేజీఎఫ్‌ను మించి యాక్షన్!

అదెలా అంటారా.. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రాలకు సంబంధించిన పోస్టర్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్ థీమ్‌లోనే రావడం గమనార్హం. దీంతో ప్రశాంత్ నీల్‌కు అసలు ఈ బ్లాక్ కలర్ ఫాంటసీ ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పక్కనబెడితే, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంటుండటంతో, ఈసారి ఆయన తెరకెక్కిస్తున్న సలార్‌తో పాటు, తారక్ 31వ చిత్రం కూడా గ్యారెంటీగా పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటడం ఖాయమని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రశాంత్ నీల్ ప్రతి సినిమాలోనూ తనదైన మార్క్‌ను చూపిస్తూనే, కథలో కొత్తదనం, హీరో ఎలివేషన్స్‌ను పీక్స్‌లో చూపించడం లాంటి అంశాలతో ఆయన తన సినిమాలను ప్రత్యేకంగా మార్చుకుంటున్నాడు.