Prabhas – Prashanth Neel : ‘బాహుబలి’ని మించి ప్రభాస్ – ప్రశాంత్ నీల్ సినిమా..

కరోనాతో షూటింగ్ బ్రేక్ తీసుకున్న ప్రభాస్‌కి ఈ గ్యాప్‌లోనే కథ చెప్పి మరో సినిమా కమిట్‌మెంట్ తీసేసుకుని లక్కీ ఛాన్స్ కొట్టేశాడు ప్రశాంత్ నీల్..

Prabhas – Prashanth Neel : ‘బాహుబలి’ని మించి ప్రభాస్ – ప్రశాంత్ నీల్ సినిమా..

Prashanth Neel To Make Big Film With Prabhas

Prabhas – Prashanth Neel: రెండు సినిమాల రిలీజ్‌తోనే స్టార్ డైరెక్టర్ స్థాయికెళ్లిపోయాడు ప్రశాంత్ నీల్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో స్టార్ హీరోల డేట్స్ దక్కించుకున్న ఈ క్రేజీ డైరెక్టర్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ సినిమా చేస్తున్నాడు. కరోనాతో షూటింగ్ బ్రేక్ తీసుకున్న ప్రభాస్‌కి ఈ గ్యాప్‌లోనే కథ చెప్పి మరో సినిమా కమిట్‌మెంట్ తీసేసుకుని లక్కీ ఛాన్స్ కొట్టేశాడు.

ప్రశాంత్ నీల్ కన్నడ డైరెక్టర్ అయినా తెలుగులో ఓన్లీ స్టార్ హీరోలతోనే సినిమాలు కమిట్ అవుతున్నాడు. ‘కె.జి.యఫ్ 2’ ఇంకా రిలీజ్ కాకుండానే వరుస పెట్టి టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలు రెడీ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్, శృతి హాసన్ కాంబినేషన్లో ‘సలార్’ సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్.. ఈ సినిమాని భారీ స్థాయిలో ప్రభాస్ స్టామినాకు తగ్గట్టు యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.

ప్రభాస్ సినిమా అవ్వకుండానే.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్‌లో ఎన్టీఆర్‌తో క్రేజీ మాసివ్ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు ప్రశాంత్ నీల్. ఈ సినిమా అసలు స్టార్ట్ అవ్వకుండానే ప్రభాస్‌తో మరో సినిమా కమిట్ అయ్యారని టాక్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో ఈసారి చెయ్యబోయే సినిమా తన స్టైల్లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కాకుండా భారీ మైథలాజికల్ మూవీగా, ప్రభాస్‌ని సరికొత్తగా పరిచయం చెయ్యబోతున్నారు.

ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న మైథలాజికల్ మూవీ దిల్ రాజు ప్రొడక్షన్‌లో రాబోతోంది. ‘బాహుబలి’ ని మించి అదిరిపోయే స్కేల్‌లో తెరకెక్కబోతోందని అటు బాలీవుడ్‌లో ఇటు టాలీవుడ్ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ప్రభాస్ ఈ సినిమా చెయ్యాలంటే ప్రస్తుతం తన చేతిలో ఉన్న ‘రాధే శ్యామ్’, ‘సలార్’, ఓమ్ రౌత్ డైరెక్షన్‌లో చేస్తున్న ‘ఆదిపురుష్’, ఆల్రెడీ నాగ్ అశ్విన్‌తో కమిట్ అయిన మరో పాన్ వరల్డ్ మూవీ.. ఈ సినిమాలన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ చెయ్యాల్సి ఉంటుంది.