Brain Health : మెదడు ఆరోగ్యానికి జాగ్రత్తలు

మెదడు ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. రోజుకు 7-8 గంటలపాటు నిద్రపోవాలి. దీని వల్ల మైండ్ యాక్టివ్ గా ఉంటుంది. రోజుకు అరగంట సమయంలో వ్యాయామాలకు కేటాయించాలి. జాగింగ్‌, వేగంగా నడక, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ వంటివి చేయటం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది.

Brain Health : మెదడు ఆరోగ్యానికి జాగ్రత్తలు

Brain Health

Brain Health : మనిషి శరీరంలో గుండె తర్వాత అత్యంత ముఖ్యమైన అవయవం మెదడు. శరీరంలో ఏఅవయవం పనిచేయాలన్నా మెదడే కీలకం. దీనిలో ఏమాత్రం లోపం తలెత్తినా మనిషి తన రోజువారి పనులను చేసుకోవటం కష్టంగా మారుతుంది. మెదడు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించకుంటే ప్రమాదం ముంచుకొస్తుంది. మారుతున్న జీవనశైలి వల్ల మెదడు పనితీరులో మార్పులు వస్తున్నాయి. అనేక మంది అధిక రక్తపోటు వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురవుతున్నారు. చిన్నవయస్సు వారు సైతం మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపధ్యంలో మెదడు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచిదని సూచిస్తున్నారు.

మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ;

మెదడు ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. రోజుకు 7-8 గంటలపాటు నిద్రపోవాలి. దీని వల్ల మైండ్ యాక్టివ్ గా ఉంటుంది. రోజుకు అరగంట సమయంలో వ్యాయామాలకు కేటాయించాలి. జాగింగ్‌, వేగంగా నడక, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ వంటివి చేయటం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. రక్తపోటుతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిని చికిత్స పొందలి. రోజు వారి ఆహారంలో అధిక ఉప్పు వినియోగాన్ని తగ్గించుకోవాలి. చేపలు, బ్లూబెర్రీస్‌, వంటల్లో పసుపు వాడాలి. గుమ్మడికాయ, నారింజ, వాల్‌నట్‌, బ్రోకలి, గుడ్లు, విటమిన్‌ బి12 ఉండే ఆహారం తీసుకోవాలి. మాట్లాడటంలో ఇబ్బంది ఎదురైనా, ముఖం వంకరపోతున్నా, చేతులు, కాళ్లు కదల్చలేని పరిస్ధితుల్లో ఉన్న మెదడు పనితీరులో ఇబ్బందికరమైన పరిస్ధితులుగా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో నిద్రలేచే సమయంలో తలనొప్పి, చూపు మందగింపు, శరీరం ఒకవైపు కుంగినట్లు అన్పించినా, వాంతుల్లాంటివి తరచూ వేధిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.