President Election: రాష్ట్రపతి పేరును ప్రకటించనున్న ఎన్డీఏ

మరికొద్ది రోజుల్లో జరగబోయే రాష్ట్రపతి ఎన్నిక కోసం జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే యోచనలో పడింది ఎన్డీఏ. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

President Election: రాష్ట్రపతి పేరును ప్రకటించనున్న ఎన్డీఏ

President

President Election: మరికొద్ది రోజుల్లో జరగబోయే రాష్ట్రపతి ఎన్నిక కోసం జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే యోచనలో పడింది ఎన్డీఏ. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ భేటీలోనే అభ్యర్థి ఎవరనే దానిపై క్లారిటీ వస్తుంది.

యోగా దినోత్సవం మేరకు పలు ప్రాంతాల్లో మంత్రులు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మైసూర్ లో మోదీ కార్యక్రమం పూర్తి చేసుకుని వచ్చాక.. పార్లమెంటరీ బోర్డు భేటీ జరిగేలా కనిపిస్తుంది. 5రోజుల క్రితమే రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనా ఇప్పటికీ అధికార, ప్రతిపక్ష కూటముల నుంచి క్యాండిడేట్ పేరు అనౌన్స్ కాలేదు.

రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ కమిటీ వేసింది. ఇదిలా ఉంటే, రాష్ట్రపతి అభ్యర్థి కోసం మంగళవారం సాయంత్రం విపక్ష పార్టీల నేతలు భేటీ కానున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో జరగనున్న సమావేశం అనంతరం పేరును అనౌన్స్ చేస్తారు. ముందుగా అధికార పక్షం ప్రకటించిన తర్వాతే ప్రతిపక్ష కూటములు ప్రకటించేలా కనిపిస్తున్నాయి.

Read Also: రాష్ట్రపతి రేసు నుంచి గోపాల క్రిష్ణ ఔట్!