Presidential Election : రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ బాక్సులు..ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తరలింపు

రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ బాక్సులను విమానంలో సీటు బుక్ చేసి తరలించారు. ప్యాసింజర్ కూర్చోనే సీట్లలో ఒక్కో బాక్సును పెట్టి చేరవేశారు. బాక్సుకు ఒక్కో అధికారిని కేటాయించారు. నిన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం 4 వేల 796 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు వేశారు.

Presidential Election : రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ బాక్సులు..ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తరలింపు

Ballot Box

Presidential election : రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ బాక్సులు ఢిల్లీకి చేరుకున్నాయి. పలు రాష్ట్రాల నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ నుంచి ఇవాళ దేశ రాజధానికి తరలించనున్నారు. నిన్న ఓటు వేసిన తర్వాత తరలించాల్సి ఉండగా…ఆలస్యం అవడంతో అసెంబ్లీలోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు.

ఇక నిన్న అస్సాం, కర్నాటక, గుజరాత్‌, మహారాష్ట్ర సహా రాష్ట్రాల నుంచి బ్యాలెట్‌ బాక్సులను రాత్రి చేరవేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు బాక్సులు ఢిల్లీ చేరుతాయని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ బాక్సులను విమానంలో సీటు బుక్ చేసి తరలించారు. ప్యాసింజర్ కూర్చోనే సీట్లలో ఒక్కో బాక్సును పెట్టి చేరవేశారు.

Presidential Elections: ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. 21న ఫలితాలు

బాక్సుకు ఒక్కో అధికారిని కేటాయించారు. నిన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం 4 వేల 796 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు వేశారు. మొత్తం 99 శాతం పోలింగ్ నమోదైందని ఈసీ వెల్లడించింది. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వంద శాతం పోలింగ్ నమోదైంది. ఈ నెల 21న రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.