PM Kisan Funds : నేడు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు జమ.. 10 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి

చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా మద్దతునివ్వడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత భూస్వాములకు కూడా విస్తరించింది.

PM Kisan Funds : నేడు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు జమ.. 10 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి

Pm Kisan Funds

PM Kisan funds to farmers : రైతులకు పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ ఇవాళ విడుదల చేయనున్నారు. 10వ ఇన్‌స్టాల్‌మెంట్‌లో భాగంగా.. రైతుల ఖాతాల్లోకి 2వేల రూపాయల చొప్పున జమ చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా ప్రధాని ఈ డబ్బులను విడుదల చేస్తారు.

దీంతో పది కోట్లకు పైగా రైతు కుటుంబాలు లబ్ధి పొందునున్నాయి. మొత్తం 20వేల కోట్లకు పైగా సొమ్మును జమ చేయనున్నారు. ఇదే కార్యక్రమంలో ఎఫ్‌పీవోలతో మోదీ సంభాషిస్తారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Farmers Oppose : ప్రధాని మోదీ పంజాబ్‌ పర్యటనను వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు

చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా మద్దతునివ్వడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో భాగంగా ప్రతి యేటా మూడు దఫాల్లో 2వేల రూపాయల చొప్పున మొత్తం 6వేల రూపాయలను నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తుంది.

ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకే పథకాన్ని ప్రకటించినా ఆ తర్వాత భూస్వాములకు కూడా విస్తరించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు లక్షా 60వేల కోట్లను రైతుల ఖాతాల్లోకి నేరుగా జమచేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పీఎం కిసాన్‌తోపాటు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా నేరుగా రైతులకు నగదును బదిలీ చేస్తుంది.