PM Modi in Nepal: సరిహద్దు వివాదం అనంతరం మొదటిసారి నేపాల్‌లో పర్యటించిన ప్రధాని మోదీ

బుద్ధ పౌర్ణిమ వేడుకల సందర్భంగా నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ పర్యటనకు వెళ్లారు. నేపాల్ లోని లుంబిని వనంలో మాయ దేవి ఆలయంలో పూజల అనంతరం పక్కనే ఉన్న అశోక స్తూపం వద్ద ప్రధాని మోదీ దీపాలు వెలిగించారు

PM Modi in Nepal: సరిహద్దు వివాదం అనంతరం మొదటిసారి నేపాల్‌లో పర్యటించిన ప్రధాని మోదీ

Modi

PM Modi in Nepal: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నేపాల్ చేరుకున్నారు. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ప్రధానులు లుంబిని వనంకు చేరుకొని, బుద్ధ పౌర్ణిమ సందర్భంగా మాయ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుద్ధ పౌర్ణిమ వేడుకల సందర్భంగా నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ పర్యటనకు వెళ్లారు. నేపాల్ లోని లుంబిని వనంలో మాయ దేవి ఆలయంలో పూజల అనంతరం పక్కనే ఉన్న అశోక స్తూపం వద్ద ప్రధాని మోదీ దీపాలు వెలిగించారు. అనంతరం 2014లో మోదీ బహుకరించిన బోధి వృక్షానికి ఇరువురు ప్రధానులు నీరు పోశారు. ఈ బోధి వృక్షాన్ని బీహార్ లోని బోధ్ గయా నుంచి ప్రధాని మోదీ ప్రత్యేకంగా తీసుకువచ్చారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..నేపాల్, భారత్ లు సరిసమానమైన సాంప్రదాయాలను పంచుకుంటున్నాయని అన్నారు. 2019లో మోదీ రెండోసారి ప్రధానిగా భాద్యతలు చేపట్టిన అనంతరం నేపాల్ పర్యటనకు వెళ్లడం ఇది తొలిసారి.

Other Stories: Rahul Gandhi: దేశ ఆర్ధిక వ్యవస్థను బీజేపీ నాశనం చేసింది: రాహుల్ గాంధీ విసుర్లు

ఈసందర్భంగా ఇరు దేశాల మధ్య పలు అంశాలపై నేతలు చర్చించనున్నారు. కాగా, 2020లో అప్పటి ప్రధాని కేపీ ఓలి హయాంలో చెలరేగిన సరిహద్దు(కలాపాని) వివాదం అనంతరం, ఇరు దేశాల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఇదే అదునుగా భావించిన చైనా నేపాల్ ను తమ వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నించింది. అయితే నేపాల్ లో కేపీ ఓలిని గద్దెదించిన అనంతరం ప్రధాని పీఠాన్ని అధిరోహించిన షేర్ బహదూర్ దేవుబా, భారత్ తో సఖ్యతను కోరుకుంటున్నట్టు వెల్లడించారు. ఏప్రిల్ నెలలో భారత పర్యటనకు వచ్చిన ప్రసుత్త ప్రధాని దేవుబా, ప్రధాని మోదీతో జరిపిన చర్చల ఫలితంగా సరిహద్దు వివాదానికి ముగింపు పలికినట్లు నేపాల్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇక ఈపర్యటనలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై ప్రధానులు చర్చించనున్నారు. కొన్ని పరస్పర అవగాహన ఒప్పందాలు కూడా జరగనున్నాయి.