Priyanka Chopra : సరోగసీ ద్వారా బిడ్డని అందుకే కనాల్సి వచ్చింది.. ప్రియాంక చోప్రా!
స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యి పోయింది. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ని వివాహం చేసుకున్న ఈ భామ గత ఏడాది సరోగసీ ద్వారా తల్లి అయ్యింది. ఈ విషయమై తీవ్ర విమర్శలు ఎదురుకుంది. దీని పై ఇప్పటి వరకు స్పందించని ప్రియాంక మొదటిసారి దీని గురించి మీడియా ముందు మాట్లాడింది.

Priyanka Chopra
Priyanka Chopra : స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యి పోయింది. నటిగా, సింగర్ గా, రైటర్ గా, ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రియాంక కూడా సింగర్ కావడంతో అమెరికన్ సింగర్ మరియు నటుడు నిక్ జోనస్ తో మంచి స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో 2018 లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది జనవరిలో వీరిద్దరూ సరోగసీ ద్వారా మాల్తీ అనే ఒక ఆడ బిడ్డకి తల్లిదండ్రులు అయ్యారు.
Priyanka Chopra : నన్ను నల్లపిల్లి అని వెక్కిరించేవాళ్ళు..
అయితే సరోగసీ ద్వారా తల్లి అవ్వడంతో ప్రియాంక చోప్రా తీవ్ర విమర్శలు ఎదురుకుంది. దీని పై ఇప్పటి వరకు స్పందించని ప్రియాంక మొదటిసారి దీని గురించి మీడియా ముందు మాట్లాడింది. నా కూతురు మాల్తీ పుట్టిన సమయంలో తను బ్రతుకుతుంది అని అనుకోలేదు. తను పుట్టినప్పుడు నా చెయ్యి అంత సైజులో కూడా లేదు. అందువల్ల తనని కొన్ని రోజులు పాటు ఇంటెన్సివ్ కేర్ లో పెట్టవలసి వచ్చింది. మాల్తీ ఇంక్యుబేటర్ లో ఉన్నంత కాలం తనని అలా చూసి చాలా బాధ పడ్డాం నేను, నిక్.
నేను సరోగసీ ద్వారా తల్లి అయ్యానని చాలా మంది చాలా విధంగా అన్నారు. ఆ ట్రోలింగ్స్ కి నా బిడ్డ గురి కాకూడదు అని తన పేస్ ని ఇప్పటి వరకు బయటకి రెవీల్ చేయలేదు. అందం తగ్గుతుందని నేను సరోగసీకి వెళ్లినట్లు అందరు అనుకుంటున్నారు. కానీ నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందువల్లే సరోగసీకి వెళ్లాల్సి వచ్చింది. సరోగసీ అంత ఏమి ఈజీ కాదు. దాని కోసం నేను, నిక్ చాలా కాలం వెతికాం. చివరికి ఒక మహిళ ఒప్పుకుంది. ఆమె సహాయానికి గుర్తుగా నా కూతురికి నా పేరుతో పాటు ఆమె పేరు కూడా వచ్చేలా పేరు పెట్టుకున్నాను అంటూ వెల్లడించింది.