Crime news: హైదరాబాద్ పరువు హత్య కేసులో పురోగతి..

: హైదరాబాద్‌లోని షాహినాథ్ గంజ్‌లో నీరజ్ అనే యువకుడిని కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య చేసిన అనంతరం నిందితులు పరారయ్యారు. ఈ పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Crime news: హైదరాబాద్ పరువు హత్య కేసులో పురోగతి..

Crime News

Crime news: హైదరాబాద్‌లోని షాహినాథ్ గంజ్‌లో నీరజ్ అనే యువకుడిని కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య చేసిన అనంతరం నిందితులు పరారయ్యారు. ఈ పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి సోదరులు, వారి స్నేహితులు కలిసి ఈ హత్యకు పాల్పడ్డారు. హత్యకు పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేయగా, మరో 10 మందిని కూడా అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు.

Crime News: 30 రూపాయల కోసం కిరాణా దుకాణదారుడిని హత్యచేశారు..

హైదరాబాద్ బేగంబజార్ లోని మచ్చీ మార్కెట్ లో పరువు హత్య ఘటన చోటు చేసుకుంది. నీరజ్ పన్వార్ అదే ప్రాంతానికి చెందిన సంజనను ఏడాదిన్నర క్రితం ప్రేమించి పెండ్లిచేసుకున్నాడు. వారికి రెండు నెలల బాబు కూడా ఉన్నాడు. పెండ్లి అయినప్పటి నుంచే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో నీరజ్ పన్వార్ బేగం బజార్ చేపల మార్కెట్ ప్రాంతంలో తన బంధువు దుకాణానికి తాతతో కలిసి వెళ్లివస్తుండగా.. ఐదుగురు దుండగులు అతని బైక్ ను అడ్డుకొని దాడికి దిగారు.

Crime News: 30 రూపాయల కోసం కిరాణా దుకాణదారుడిని హత్యచేశారు..

ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన నిరజ్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నీరజ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నీరజ్ ను హత్యచేసిన ఐదుగురు నిందితులు పర్యారయ్యారు. హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ పుటేజ్ ల ఆధారంగా నిందితులను గుర్తించారు. వారిని పక్క రాష్ట్రమైన కర్ణాటకలోని గురుమత్కల్ లో హైదరాబాద్ పశ్చిమ మండల పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సీసీ కెమెరాల ఆదారంగా హత్యకు సహకరించారన్న అనుమానంతో పది మందిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.