Pune : ఫ్రీ బిర్యానీ ఎంత పని చేసింది ? మహిళా ఐపీఎస్ ఆడియో క్లిప్ వైరల్

ఫ్రీ బిర్యానీ ఎంత పని చేసింది ? మహిళా పోలీస్ అధికారిణి చేసిన పని చివరకు ఆమెకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఉచితంగా బిర్యానీ కావాలని డిమాండ్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలకు తెలియడం, దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీంతో ఆ మహిళా పోలీస్ అధికారిణి స్పందించాల్సి వచ్చింది.

Pune : ఫ్రీ బిర్యానీ ఎంత పని చేసింది ? మహిళా ఐపీఎస్ ఆడియో క్లిప్ వైరల్

Biryani

Woman DCP’s ‘Free Biryani’ : ఫ్రీ బిర్యానీ ఎంత పని చేసింది ? మహిళా పోలీస్ అధికారిణి చేసిన పని చివరకు ఆమెకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఉచితంగా బిర్యానీ కావాలని డిమాండ్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలకు తెలియడం, దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీంతో ఆ మహిళా పోలీస్ అధికారిణి స్పందించాల్సి వచ్చింది. ఇదంతా మార్ఫింగ్, తనను తొలగించాలనే ఉద్ధేశ్యంతో కొంతమంది ఇలా చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయం రాష్ట్ర హోం మంత్రి వరకు వెళ్లింది. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

Read More : Covid Vaccinated People : వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనూ అధిక వైరస్.. మిగతావారికి అంటించగలరు!

మహారాష్ట్రలో విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేశీ ఘీ రెస్టారెంట్ చాలా ఫేమస్. ఇందులో బిర్యానీకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ర్యాంకులో మహిళా ఐపీఎస్ అధికారిణిగా పనిచేస్తున్నారు. ఏ రెస్టారెంట్ లో మంచి బిర్యానీ దొరుకుతుందని ఆరా తీశారు. దేశీ ఘీ రెస్టారెంట్ లో బిర్యానీ బాగా రుచిగా ఉంటుందని సబార్డినేట్ వెల్లడించారు. మటన్ బిర్యానీ తెప్పించాలని కోరింది. రెస్టారెంట్ వాళ్లు డబ్బులు అడిగితే..స్థానిక పోలీస్ ఇన్స్ పెక్టర్ తో మాట్లాడించాలని చెప్పారు.

Read More : Shakeela Health : బతికే ఉన్నా..ఆరోగ్యం బాగానే ఉంది

తాము ఎప్పుడూ బయటినుంచి ఆర్డర్ చేసినా..డబ్బులు చెల్లిస్తుంటాం అని సబార్డినేట్ సమాధానం ఇచ్చారు. మా పరిధిలో ఉన్న రెస్టారెంట్ కు కూడా డబ్బులు చెల్లించాలా ? అక్కడి ఇన్స్ పెక్టర్ చూసుకుంటాడని మహిళా అధికారిణి తెలిపారు. అయితే..దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ గా మారింది. మహిళా అధికారిణిపై పలు విమర్శలు చెలరేగాయి. దీనిపై ఆ మహిళా అధికారిణి స్పందించారు. తన వాయిస్ తో ఉన్న ఆడియో క్లిప్ ను మార్ఫింగ్ చేశారని ఆరోపించారు.

Read More : All The Best : అడుగు దూరంలో, సింధు మ్యాచ్‌‌పై ఉత్కంఠ

తాను చేస్తున్న జోన్ లో కొంతమంది ఇక్కడే పనిచేస్తున్నారని, వారి ఆర్థిక ప్రయోజనాలు ఇక్కడే ఉన్నాయని తెలిపారు. తాను ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన తర్వాత..వారి కార్యకలాపాలు ఆగిపోయాయని, అందుకే తనను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ కుట్రలో కొందరు సీనియర్ అధికారులున్నారని, సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తానని తెలిపారు. వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర హోం మంత్రి ఆదేశాలు జారీ చేశారు.