Punjab Elections 2022 : ఈ నెల 27న పంజాబ్‌లో రాహుల్ పర్యటన.. నవజ్యోత్ సింగ్ ట్వీట్..

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ జనవరి 27న పంజాబ్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ ట్విట్ట‌ర్ వేదికగా వెల్లడించారు.

Punjab Elections 2022 : ఈ నెల 27న పంజాబ్‌లో రాహుల్ పర్యటన.. నవజ్యోత్ సింగ్ ట్వీట్..

Punjab Elections 2022 Rahul

Updated On : January 25, 2022 / 4:39 PM IST

Punjab elections 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరు పెంచేశాయి. ఇప్పటికే బీజేపీ సహా ఇతర పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో ప్రచారంలో దూసుకెళ్తోంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ జనవరి 27న పంజాబ్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేరకు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ ట్విట్ట‌ర్ వేదికగా వెల్లడించారు.

‘మా నాయకుడు రాహుల్‌గాంధీ ఈ నెల 27న పంజాబ్‌లో పర్యటించనున్నారు. ఆయ‌నకు ఘ‌నస్వాగ‌తం పలికేందుకు ప్ర‌తి కాంగ్రెస్ కార్య‌క‌ర్త ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు’ అని సిద్ధూ ట్వీట్ చేశారు. జనవరి 27న గురువారం రాహుల్‌గాంధీ ప్ర‌త్యేక విమానంలో పంజాబ్‌కు చేరుకోనున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగిన 117 మంది కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌తో క‌లిసి రాహుల్ రోడ్డు మార్గాన పర్యటించనున్నారు. అమృత్‌స‌ర్‌లోని హ‌ర్‌మందిర్ సాహిబ్‌ను ముందుగా రాహుల్ సందర్శించనున్నారు.


శ్రీదుర్గాయ మందిర్‌ను, భ‌గ‌వాన్ వాల్మీకి తీర‌థ్ స్థ‌ల్‌ను కూడా రాహుల్ సంద‌ర్శించనున్నారు. ఈ సందర్భంగా రాహుల్ ప్ర‌త్యేక పూజ‌లు చేయనున్నారు. దైవదర్శనం అనంతరం రోడ్డు మార్గాన జ‌లంధ‌ర్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రాహుల్ వ‌ర్చ‌వ‌ల్ ర్యాలీ నిర్వ‌హించ‌నున్నారు. అనంతరం రోడ్డు జ‌లంధ‌ర్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్క‌డి నుంచి ప్ర‌త్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి వెళ్లిపోనున్నారు. ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగ‌నుంది.

Read Also : Varun Tej-Ram Charan : అయ్యయ్యో.. అన్నదమ్ములు ముసలోళ్లయిపోయారే!