PV sindhu in patola saree : పద్మభూషణ్‌ అందుకున్నప్పుడు పీవీ సింధు క‌ట్టుకున్న చీరకు ఎన్ని ప్రత్యేకతలో..

పద్మభూషణ్ అవార్డు అందుకున్పప్పుడు పీవీ సింధు కట్టుకున్న చీరకు ఉన్న ప్రత్యేకత హాట్ టాపిక్ గా మారింది...

PV sindhu in patola saree : పద్మభూషణ్‌ అందుకున్నప్పుడు పీవీ సింధు క‌ట్టుకున్న చీరకు ఎన్ని ప్రత్యేకతలో..

Pv Sindhu In Patola Saree On Padma Bhushan Award

PV sindhu in patola saree : పద్మ అవార్డులు అందుకున్నప్పుడు సమయంలో పలువురు పురస్కార గ్రహీతలు వారి వారి సంప్రదాయాల ప్రకారం దుస్తులు ధరించారు. అలా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్‌ అందుకున్న‌ప్పుడు బాట్మింటన్ స్టార్ పీవీ సింధు క‌ట్టుకున్న చీర ప్ర‌త్యేక‌త గురించి పెద్ద టాపిక్కే నడుస్తోంది. ఎందుకంటే ఆమె కట్టుకున్న చీర ప్రత్యేత అది. ‘పద్మభూషణ్‌’ పురస్కారం అందుకున్నప్పుడు సింధు చేనేత చీరకట్టులోనే ఆకట్టుకునేలా సంప్రదాయంగా కనిపించారు. ఆమె కట్టుకున్న చీరలో చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. ఆలివ్‌ గ్రీన్‌ రంగు డబుల్‌ ఇక్కత్‌ పటోలా చీర అది. చీరపై కాంజీవరం బ్లౌజ్‌ ధరించి ఈచీరకు మరింత వన్నె తెచ్చింది.

Read more : PV Sindhu Padma Bhushan : రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా..ప‌ద్మ‌భూష‌ణ్‌ అవార్డు అందుకున్న పీవీ సింధు

సింధు కట్టుకున్న ఈ పటోలా చీరకు పెద్ద చరిత్రే ఉందట. అదేమంటే..ఈ పటోలా డబుల్‌ ఇక్కత్‌ చీరల తయారీ అందరు నేతన్నలకు సాధ్యం కాదు. కేవలం కొన్ని కుటుంబాలకు మాత్రమే ఆ ప్రత్యేకత కలిగి ఉన్నారు. ఈ నైపుణ్యానికి అడ్రస్ గా గుజరాత్‌లోని పటాన్‌ ప్రాంతం. ఈ ప్రాంతంలో కొన్ని కుటుంబాలకే ఈ పనితం కలిగి ఉన్నారు. ఈ పనితనం గురించి ఆ కుటుంబీకులు బయటవారికి అస్సలు చెప్పరు. వారి వారసీకులకు మాత్రమే చెబుతారు.

Read more : Manjamma Jogati : పద్మశ్రీ అవార్డు అందుకుంటూ.. రాష్ట్ర‌ప‌తికి చీర కొంగుతో దిష్టితీసిన ట్రాన్స్ జెండర్

అలా వారి కుటుంబాల వారికి మాత్రమే అటువంటి చీరలు నేయటం కలిగి ఉంటారు. ఇంతకీ సింధు కట్టుకున్న ఆ పటోలా పట్టుచీర ప్రత్యేకత ఏమిటంటే..ఈ చీర రెండువైపులా ఒకేలా ఉంటుంది. ఏది ముందు భాగం, ఏది వెనుక భాగం అనేది తెలికుండా ఉంటుంది. పోల్చుకోవటం చాలా కష్టమట. ఆఖరికి ఆ చీర నేసినవారు కూడా చెప్పలేకపోతున్నారట.

Read more : Padma Shri : రోడ్డుపై బత్తాయి పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ

కొన్ని వందల ఏండ్లయినా చీర వన్నె తగ్గదట. అటువంటి ప్రత్యేకత కలిగిన ఇటువంటి డబుల్‌ ఇక్కత్‌ పటోలా ఒక్క చీర నేయడానికి ఆరు నుంచి 12 నెలలు పడుతుందట. మరి సమయానికి తగినట్లు..దానిలో వినియోగించిన మెటిరియల్ కుతగినట్లు..క్రియేటి..పనితనానికి తగినట్లుగానే ధర కూడా ఉంటుందనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అలా ఈ డబులు ఇక్కత్ పటోలు పట్టుచీర ధర లక్ష నుంచి రెండు లక్షల వరకూ ఉంటుంది.

Read more : Padma Shri Tulasi Gowda: కాళ్లకు చెప్పులు కూడా లేని పద్మ శ్రీ అవార్డు గ్రహీత తులసీ గౌడ