PV Sindhu Padma Bhushan : రాష్ట్రపతి చేతుల మీదుగా..పద్మభూషణ్ అవార్డు అందుకున్న పీవీ సింధు
బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా పద్మవిభూషన్ అవార్డు అందుకున్నారు.

pv sindhu awarded the padma bhushan : 2016 రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించి ‘వెండి కొండ’ తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన పీవీ సింధు పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా పూసర్ల వెంకట సింధు పద్మవిభూషన్ అవార్డు అందుకున్నారు. 2020 సంవత్సరానికి గాను పీవీ సింధుకి పద్మవిభూషణ్ అవార్డు వరించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ఆమె ఆ అవార్డును స్వీకరించారు సింధు. ఒలింపిక్ ప్లేయర్ పుసర్ల వెంకట సింధు రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో సిల్వర్ పతకం గెలవగా.. ఇటీవల టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్‌లో ఆమె బ్రాంజ్ మెడల్‌ను గెలుచుకుంది సింధు. 2015లో సింధుకు పద్మశ్రీ అవార్డు దక్కింది.
Read more : Bus fares reduced : సామాన్యులకు గుడ్ న్యూస్..బస్సు చార్జీలు తగ్గింపు
ఈ పద్మ అవార్డుల కార్యక్రమంలో వైద్య రంగంలో పద్మశ్రీ అవార్డు గెలుచుకున్న ఎయిర్ మార్షల్ డాక్టర్ పద్మ భందోపాధ్యాయ కూడా రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ఆమెఅవార్డును అందుకున్నారు. కాగా..ఈ ఏడాది ప్రభుత్వం 119 పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. దాంట్లో ఏడు పద్మ విభూషణ్, పది పద్మభూషణ్, 102 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డులు అందుకున్నవారిలో 29 మంది మహిళలు ఉన్నారు. మరో 16 మందికి మరణానంతరం అవార్డులను ఇచ్చారు. పద్మ అవార్డులు స్వీకరించిన వారిలో ఓ ట్రాన్స్‌జెండర్ కూడా ఉన్నారు.
Read more : LK Advani 94th Birthday : LK అద్వానీ 94వ పుట్టిన రోజు..కేక్ కట్ చేయించిన బీజేపీ అగ్రనేతలు
కాగా..పీవీ సింధుకి 2012 సెప్టెంబరు 21 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన స్థానాల్లో మొదటి 20 క్రీడాకారిణుల జాబితాలో చోటు దక్కించుకోవడంతో మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఆగస్టు 10 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించి, ఆ పతకం గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. 2015 మార్చి 30 న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రధానం చేసింది. 2016 ఆగస్టు 18 న రియో ఒలింపిక్స్ లో జరిగిన సెమీఫైనల్లో జపాన్ కు చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించి ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తరువాత జరిగిన ఫైనల్లో రజత పతకం సాధించి, ఒలింపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచింది పీవీ సింధు.
Delhi: Olympian badminton player PV Sindhu awarded the Padma Bhushan pic.twitter.com/TqUldnQgr3
— ANI (@ANI) November 8, 2021
- Padma Awards: రాష్ట్రపతి భవన్లో రెండో విడత ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం
- PV Sindhu : స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత పీవీ సింధు
- PV Sindhu: తమిళ్ సాంగ్‌కు నడి రోడ్డుపై పీవీ సింధు డ్యాన్స్
- Visakha : విశాఖ సాగర తీరంలో యుద్ధనౌకల సమీక్ష..
- CM KCR Birthday : సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి బర్త్ డే విషెస్ తెలిపిన రాష్ట్రపతి రామ్ నాథ్, ప్రధాని మోదీ
1IPL2022 Gujarat Vs RR : గుజరాత్ గర్జన.. నేరుగా ఫైనల్‌కు.. ఓడినా రాజస్తాన్‌కు మరో ఛాన్స్
2Kottu Satyanarayana Allegations : కోనసీమ అల్లర్లు.. జనసేన, టీడీపీ కుట్రలో భాగమే -మంత్రి సంచలన ఆరోపణలు
3Telangana Covid Bulletin : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే
4Konaseema : సాంప్రదాయాలకు, మర్యాదలకు పుట్టినిల్లు కోనసీమ
5IPL2022 Rajasthan Vs GT : బట్లర్ బాదుడు.. గుజరాత్ ముందు భారీ టార్గెట్
6Wife attack Husband: వామ్మో ఇదేం బాదుడు: భర్తను పిచ్చకొట్టుడు కొడుతున్న భార్య
7Konaseema Tension : హింసాత్మక ఘటనలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు : ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు
8F3: ఎఫ్3లో హీరోలు అలా చేసి నవ్విస్తారు – అనిల్ రావిపూడి
9Vegan Dinosaur: డైనోసార్లు వెజిటేరియన్లా.. జపాన్ లో కనిపించిన శిలాజాలు చెప్తున్నాయేంటంటే..
10Konaseema Tension : కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలి-చంద్రబాబు నాయుడు
-
Rahul Gandhi: బ్రిటన్ ఎంపీతో రాహుల్ గాంధీ ఫోటో: దేశంపై కుట్ర పన్నుతున్నారా అంటూ బీజేపీ వ్యాఖ్య
-
Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?
-
Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
-
Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న
-
Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ వెనుక జరీన్ 14 ఏళ్ల శ్రమ ఉంది: కోచ్ భాస్కర్ భట్
-
Six on Scooter: ఒకే స్కూటర్ పై ఆరుగురు యువకుల ప్రయాణం: పోలీసులు ఏం చేశారంటే!
-
Venkatesh: మరో రెండు ప్రాజెక్టులకు వెంకీ సై!
-
Nikhil: ఫస్ట్‌టైమ్ అలా చేస్తున్న నిఖిల్..?