Qutub Minar: అది కుతుబ్ మినార్ కాదు, సూర్యుడి గమనాన్ని కొలిచే గోపురం: పురావస్తుశాఖ మాజీ అధికారి

కుతుబ్ మినార్ ను ఢిల్లీ సుల్తాన్..కుతుబ్ అల్-దిన్ ఐబక్ నిర్మించలేదని..5వ శతాబ్దానికి చెందిన భారతీయ రాజు రాజా విక్రమాదిత్య ఈ స్థూపాన్ని నిర్మించారని పురావస్తుశాఖ మాజీ అధికారి ఒకరు వెల్లడించారు

Qutub Minar: అది కుతుబ్ మినార్ కాదు, సూర్యుడి గమనాన్ని కొలిచే గోపురం: పురావస్తుశాఖ మాజీ అధికారి

Qutub

Updated On : May 18, 2022 / 5:40 PM IST

Qutub Minar: గత కొన్ని రోజులుగా దేశంలో పలు చోట్ల చోటుచేసుకున్న మతపరమైన అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కర్ణాటకలో హిజాబ్ వివాదం, మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ల వివాదం, ఆగ్రాలో తాజ్ మహల్ వివాదం, మరియు వారణాసిలో జ్ఞానవాపి మసీదులో శివలింగం వివాదం వంటి ఘటనలు ఉద్రికత్తతకు దారి తీస్తున్నాయి. ఈక్రమంలో ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన ‘కుతుబ్ మినార్’ గురించి మరో దుమారం చెలరేగింది. ఆధునిక చరిత్ర పుస్తకాల్లో చెప్పినట్టుగా కుతుబ్ మినార్ ను ఢిల్లీ సుల్తాన్..కుతుబ్ అల్-దిన్ ఐబక్ నిర్మించలేదని..5వ శతాబ్దానికి చెందిన భారతీయ రాజు రాజా విక్రమాదిత్య ఈ స్థూపాన్ని నిర్మించారని పురావస్తుశాఖ మాజీ అధికారి ఒకరు వెల్లడించారు.

Other Stories:Mathura court : మసీదు ఉన్న ప్రాంతం శ్రీకృష్ణుడి పుట్టినస్థలం..ఇక్కడ నమాజులు చేయకుండా ఆపండీ : మథుర కోర్టులో పిటిషన్

5వ శతాబ్దంలో భారతదేశాన్ని పాలించిన రాజా విక్రమాదిత్య..సూర్యుడి గమనాన్ని కొలిచేందుకు ఈ అతి పెద్ద స్థూపాన్ని నిర్మించారని, ఆకాలంలో ఇది ఆసియ ఖండంలోనే అతిపెద్ద స్థూపంగా చరిత్రకారులు పేర్కొన్నట్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) మాజీ ప్రాంతీయ డైరెక్టర్ ధరమ్‌వీర్ శర్మ చెప్పుకొచ్చారు. కుతుబ్ మినార్ పై అనేక సార్లు సర్వే చేసిన శర్మ..ఆమేరకు తన వద్ద బలమైన అధరాలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. కుతుబ్ మినార్ టవర్‌లో 25 అంగుళాల వంపు ఉంది.

Other Stories: S-400 Missiles: చైనా, పాక్‌ను ఎదుర్కొనేందుకు S-400 క్షిపణులను మోహరించనున్న భారత్: అమెరికా నిఘావర్గాలు

ఇది ప్రత్యేకంగా సూర్యుడిని గమనించడానికి తయారు చేయబడినందున, ప్రతి ఏడాది జూన్ 21న, సూర్యాస్తమయం మారే మధ్య, కనీసం అరగంట పాటు నీడ ఆ ప్రాంతంపై పడదు. ఇది సైన్స్ మరియు పురావస్తు వాస్తవం,” అని శర్మ వివరించారు. కుతుబ్ మినార్ ఒక స్వతంత్ర నిర్మాణమేనని, అయితే దాని సమీపంలోని మసీదుకు, ఈ స్థూపానికి ఎటువంటి సంబంధం లేదని శర్మ తెలిపారు. రాత్రి సమయంలో ఆకాశంలో ధృవ నక్షత్రాన్ని సూచించేలా కుతుబ్ మినార్ తలుపు కూడా ఉత్తరం వైపు ఉంటుందని ధరమ్‌వీర్ శర్మ జాతీయ మీడియాతో చెప్పుకొచ్చారు.